NTV Telugu Site icon

Vijay-Rashmika: ఫిబ్ర‌వ‌రిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్?

Vijay Rashmika Engagement

Vijay Rashmika Engagement

Vijay Deverakonda, Rashmika Mandanna to get engaged in February: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ సోయగం రష్మిక మందన్న డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పార్టీలు, విహారయాత్ర, పండగలను ఇద్దరు కలిసి చేసుకోవడం.. వీరిద్దరూ క‌లిసి ఒకే లోకేషన్‌లో దిగిన ఫోటోలను వేర్వేరుగా పోస్ట్ చేయడంతో ఈ డేటింగ్ వార్త‌ల‌కు మరింత బలం చేకూరింది. అయితే విజయ్, రష్మికలు ఇప్పటివరకు తమ డేటింగ్‌ గురించి ఎక్కడా స్పందించలేదు. అయితే తాజాగా వీరిద్దరికి సంబధించిన మ‌రో వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారట. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఫిబ్రవరి రెండవ వారంలో విజయ్, రష్మికలు ఎంగేజ్‌మెంట్‌ చేసుకోనున్నారట. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన వార్త‌ను త్వరలో అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెల్సుస్తోంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలనట్లు స‌మాచారం. విజయ్, రష్మిక జంటగా ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రాల్లో నటించారు. గీత గోవిందం చిత్రీకరణ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారట.

Also Read: Golden Globe Awards 2024: గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌.. ఓపెన్‌హైమర్‌కు ఐదు అవార్డులు!

‘కిరిక్ పార్టి’ అనే కన్నడ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన రష్మిక మందన్న.. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమానే హిట్ కావడంతో తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఛలో, గీతాగోవిందం, దేవ్ దాస్, సరిలేరు నీకెవ్వరూ, పుష్ప, సీతారామం లాంటి భారీ హిట్లు రష్మిక ఖాతాలో ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన రష్మిక.. ‘యానిమల్’తో బాలీవుడ్‌లో భారీ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ షూటింగ్‌లో ఉన్నారు. ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘చావా’ సినిమాలు చేయాల్సి ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’లో నటిస్తున్నాడు.