Drinking Water Per Day: నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ రెండు లీటర్ల నీరు తాగాలి లేదా 8 గ్లాసుల నీరు సేవించాలి. అయితే ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నట్లు సైంటిస్ట్ లు కనుగొన్నారు. గ్లాసుల కొలత కరెక్ట్ కాదని నిర్థారించారు. అలాంటప్పుడు 2 లీటర్ల నీరు కంటే ఎక్కువ తీసుకునే అవకాశం ఉందని కనుగొన్నారు. ఇక మనం తినే ఆహారం ద్వారానే మన శరీరానికి కావాల్సిన చాలా నీరు లభిస్తుందని పరిశోధనలో వెల్లడయ్యింది. చాలా మంది రెండు లీటర్ల నీరు తాగాలి అని దాహం వేయకపోయినా తాగుతూ ఉంటారు. అయితే అలా ఎవరెవరు ఎంత నీరు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండదట.
Also Read: Hair Growth Tips: జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్స్ ను ట్రై చెయ్యాల్సిందే..!
వారు చేసే పని, ఉండే ప్రదేశం, వారి ఆహారపు అలవాట్లు ఇలా రకరకాల వాటిపై ఆధారపడి ఉంటుందంట. అంతేకాకుండా వయసు, నివసిస్తున్న ప్రదేశం సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉంది, ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులు, శారీరక కష్టం ఇలా చాలా వాటిపై మనం నీరు తీసుకోవడం అనేది ఆధారపడి ఉంటుంది. అంతేకాదు ఎప్పుడు పడితే అప్పుడు నీరు తగినా అంత ప్రయోజనం ఉండదని వ్యాయామానికి ముందు, తరువాత, లేదా బాగా దప్పిక వేసినప్పుడు తీసుకునే నీళ్లే ఎక్కువ ఉపయోగపడతాయని ఈ పరిశోధనలో తేలింది. దీనికి కోసం సైంటిస్ట్ లు 23 దేశాలకు చెందిన దాదాపు 5,604 మంది మీద అధ్యయనం చేశారు. తరువాత తుది నిర్ణయానికి వచ్చారు. కాబట్టి నీరు ఎంత తీసుకున్న మంచిదే అన్న భ్రమలో ఎక్కువ నీరు తీసుకోకండి. అతిగా నీరు తీసుకుంటే కూడా ఎన్నో అనర్థాలు ఉన్నాయి.