Site icon NTV Telugu

ICC World Cup 2023: పాకిస్థాన్ వరల్డ్ కప్ ఆడేది అనుమానమే..?

World Cup

World Cup

ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023ను టోర్నమెంట్ ను పాకిస్థాన్ జట్టు బహిష్కరించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీమిండియా ఆసియా కప్ ను పాక్ లో ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. వరల్డ్ కప్ లో పాక్ టీమ్ భారత్ లో ఎందుకు ఆడాలనే ప్రశ్న తలెత్తనుంది. అయితే, పాక్ ప్రభుత్వంతో జరుగుతున్న పరిణామాలను భట్టి చూస్తుంటే వరల్డ్ కప్ ఆడేది అనుమానంగానే ఉంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు దాయాది జట్టును పంపించడంపై నిర్ణయం తీసుకునేందుకు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

Read Also: Jeevan Reddy: కేసీఆర్ అడుగుజాడల్లోనే మోడీ నడుస్తున్నారు

ఇదే టైంలో ఆసియా కప్‌లో ఆడేందుకు పాకిస్థాన్ కు వెళ్లడం లేదని భారత్ తెలిపింది. టీమిండియా ఆసియా కప్ కోసం పాక్‌కు వచ్చేందుకు ఇష్టపడనప్పుడు వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఎందుకు నిర్వహించకూడదు..? అని ఆ దేశ క్రీడాశాఖ మంత్రి ఎహ్సాన్ మజారీ ప్రశ్నించారు. మరోవైపు ఆసియా కప్‌కు సంబంధించి హైబ్రిడ్ మోడల్‌ను ధృవీకరించడానికి ఐసీసీ బోర్డు రేపు (గురువారం) సమావేశం నిర్వహించనుంది. ఈ తరుణంలో బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) కార్యదర్శి జై షా, పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చీఫ్ జకా అష్రఫ్ డర్బన్‌లో సమావేశం కానున్నారు.

Read Also: Shah Rukh Khan : న‌య‌న‌తార భ‌ర్త‌కు షారుఖ్ ఖాన్‌ వార్నింగ్.. విక్కీ షాకింగ్ రిప్లై

పాక్‌లో ఆడేందుకు భారత్ ఓప్పుకోకపోవడంతో ఆసియా కప్‌కు హైబ్రిడ్ మోడల్‌ను మాజీ పీసీబీ చీఫ్ నజామ్ సేథీ ప్రకటించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆమోదించిన ఆ మోడల్ ప్రకారం పాకిస్తాన్‌లో నాలుగు లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆ తర్వాత శ్రీలంకలో 9 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అందులో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది. ఒకవేళ రెండు జట్లు ఫైనల్‌కు వెళ్తే ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరుగనుంది. ఈ హైబ్రిడ్ మోడల్‌ను ప్రస్తుత పీసీబీ చీఫ్ జకా అష్రఫ్ వ్యతిరేకించారు.

Read Also: Tamannaah Bhatia: తమన్నా స్కిన్ షో.. ఎట్టకేలకు లక్కీ ఛాన్స్ పట్టేసిందన్నమాట..?

అయితే.. ఈ మోడల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇప్పటికే ఆమోదించడంతో షెడ్యూల్‌లో మార్పులు ఉండబోవని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. కాగా.. ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టు ఆడే వేదికలను పరిశీలించేందుకు భారత్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ బృందాన్ని పంపిస్తోంది. దీన్ని బట్టి పాక్ జట్టును భారత్‌కు పంపడానికి పాకిస్థాన్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Exit mobile version