Shah Rukh Khan vs Vignesh Shivan Conversation on Jawan Prevue: బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టి సినిమా ప్రెవ్యూ విడుదల చేశారు. ఆ వీడియోకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోండగా ఈ విషయం మీద ప్రసంశలు కురిపించిన నయనతార భర్తకి ఆమెతో జాగ్రత్తగా ఉండమని షారఖ్ ఖాన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అసలు విషయం ఏమంటే జవాన్ ప్రెవ్యూపై నయనతార భర్త విఘ్నేష్ శివన్ ప్రసంశలు కురిపించి, తనకు ఆ వీడియో ఎంతో నచ్చిందని చెప్పారు. ఇలాంటి ఓ పెద్ద చిత్రంతో అట్లీ బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నందుకు చాలా గర్వంగా ఉందని చెబుతూనే ప్రెవ్యూ అంతర్జాతీయ స్థాయిలో ఉందని, షారుఖ్ ఖాన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాలనే తన భార్య నయనతార కల కూడా నెరవేరిందని చెప్పుకొచ్చాడు.
ఇక ఇది చూసిన షారుఖ్ ఖాన్ “విఘ్నేష్ శివన్ మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చాడు. నయన్ అద్భుతమైన వ్యక్తి, ఓర్నీ నేను ఇది ఎవరితో చెబుతున్నాను?, ఈ విషయం మీకు ఇప్పటికే తెలుసుకు కదా..!!! అయితే.. ఆమె ఇటీవల కొన్ని కిక్‌లు, పంచ్‌లు నేర్చుకుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.” అంటూ షారుఖ్ ఖాన్ అన్నాడు. దానికి నయనతార భర్త విగ్నేష్ శివన్ స్పందిస్తూ మీరు చాలా దయగలవారు సార్, అవును సార్ చాలా జాగ్రత్తగా ఉన్నా, అయితే సినిమాలో మీ ఇద్దరి మధ్య మంచి రొమాన్స్ కూడా ఉందని విన్నాను. ఆమె శృంగార రాజు నుండి కొన్ని టిప్స్ నేర్చుకుంది. ఆమె కలగన్నట్టే షారూఖ్ ఖాన్ ది కింగ్ ఆఫ్ హార్ట్స్ #బాద్షా, #జవాన్ తో అరంగేట్రం చేస్తోంది. అట్లీ ఈ జవాన్ సినిమా భారీ గ్లోబల్ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటూ ఆయన కామెంట్ చేశారు.
😆 soooo kind of you sir 😇😇❤️
Yes sir being very careful 🫡 but I also heard there is some good romance between the both of you in the movie , that she has learnt from the king of romance 🥰 , so already cherishing that with the happiness of such a dream Debut with YOU #SRK… https://t.co/hqOSBI3YUF— VigneshShivan (@VigneshShivN) July 12, 2023