NTV Telugu Site icon

Vishaka MP Seat: ఏపీ బీజేపీలో పెరుగుతోన్న పోటీ.. విశాఖపై కీలక నేతల కన్ను!

Bjp

Bjp

Visakha MP Seat Competition in BJP: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దేశవ్యాప్తంగా రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలెక్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. కొన్నిచోట్ల సీట్ కోసం కీలక నేతలు కన్నేశారు. అందులో ఒకటి విశాఖ సీట్. ఈ సీట్ కోసం బీజేపీలో రోజురోజుకి పోటీ పెరుగుతోంది.

విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖ నుంచి పోటీ చేస్తానని అధిష్టానానికి సీఎం రమేష్ ఇప్పటికే చెప్పారట. విశాఖ లోక్ సభ టిక్కెట్ ఆశించి.. ఇప్పటికే అక్కడ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మకాం వేశారు. తనదైన శైలిలో అక్కడి ప్రజలను ఆకర్షిస్తున్నారు. బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పేరునూ పార్టీ హైకమాండ్ ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ చిన్న అవకాశం ఉన్నా.. విశాఖ నుంచి ఏపీగా ఆమెను దించాలని చూస్తోందట. ఇక టీడీపీ నుంచి బాలయ్య బాబు చిన్నల్లుడు భరత్ టిక్కెట్ ఆశిస్తున్నారట. దాంతో ఇక్కడా తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎవరికి దక్కుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Also Read: Peddireddy Ramachandra Reddy: ప్రజలు ఎవ్వరూ చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరు: పెద్దిరెడ్డి

ఆయితే ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ కీలక నేతలు సమావేశమై ఇందుకు సంబంధించి చర్చలు జరిపినట్లు సమాచారం. ఢిల్లీ నేతలు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సహా ఏపీకి చెందిన పలువురు నేతలు ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని భావిస్తుండగా.. తాజా పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోటీకి రికార్ఢు స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటివరకు 3283 దరఖాస్తులు.. 25 లోక్‌సభ స్థానాలకు 1861 దరఖాస్తులు అందాయని తెలుస్తోంది.