Vishaka MP Seat: ఏపీ బీజేపీలో పెరుగుతోన్న పోటీ.. విశాఖపై కీలక నేతల కన్ను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakha MP Seat Competition in BJP: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దేశవ్యాప్తంగా రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలెక్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. కొన్నిచోట్ల సీట్ కోసం కీలక నేతలు కన్నేశారు. అందులో ఒకటి విశాఖ సీట్. ఈ సీట్ కోసం బీజేపీలో రోజురోజుకి పోటీ పెరుగుతోంది.
విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖ నుంచి పోటీ చేస్తానని అధిష్టానానికి సీఎం రమేష్ ఇప్పటికే చెప్పారట. విశాఖ లోక్ సభ టిక్కెట్ ఆశించి.. ఇప్పటికే అక్కడ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మకాం వేశారు. తనదైన శైలిలో అక్కడి ప్రజలను ఆకర్షిస్తున్నారు. బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పేరునూ పార్టీ హైకమాండ్ ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ చిన్న అవకాశం ఉన్నా.. విశాఖ నుంచి ఏపీగా ఆమెను దించాలని చూస్తోందట. ఇక టీడీపీ నుంచి బాలయ్య బాబు చిన్నల్లుడు భరత్ టిక్కెట్ ఆశిస్తున్నారట. దాంతో ఇక్కడా తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎవరికి దక్కుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
Also Read: Peddireddy Ramachandra Reddy: ప్రజలు ఎవ్వరూ చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరు: పెద్దిరెడ్డి
ఆయితే ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ కీలక నేతలు సమావేశమై ఇందుకు సంబంధించి చర్చలు జరిపినట్లు సమాచారం. ఢిల్లీ నేతలు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సహా ఏపీకి చెందిన పలువురు నేతలు ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని భావిస్తుండగా.. తాజా పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోటీకి రికార్ఢు స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటివరకు 3283 దరఖాస్తులు.. 25 లోక్‌సభ స్థానాలకు 1861 దరఖాస్తులు అందాయని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!