Site icon NTV Telugu

Ali Khamenei: “భయపడొద్దు..” ఇరాన్ ప్రజలకు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ కీలక సందేశం..

Ayatollahalikhamenei

Ayatollahalikhamenei

ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పరస్పరం బాంబుల మోత మోగిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇప్పటికే ఇరుదేశాల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్‌లోని సోరోకా హాస్పిటల్, స్టాక్ ఎక్స్ఛేంజ్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కీలక ప్రకటన చేశారు. ఖమేనీ తన ఎక్స్‌ ఖాతాలో తన దేశస్థులను ఉద్దేశించి ఓ పోస్ట్‌ పెట్టారు. మీరు శత్రువుకు భయపడితే.. వాళ్లు మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు అని రాసుకొచ్చారు.

READ MORE: Rythu Bharosa: రికార్డు వేగంతో రైతు భరోసా.. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.6405 కోట్లు

“నా ప్రియమైన దేశం, దేశ ప్రజలకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు శత్రువులను చూసి భయపడుతున్నారనే అభిప్రాయం కలిగితే.. వారు మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. మీరు ఇప్పటివరకు చూపించిన ధైర్యం, అదే దృఢ సంకల్పాన్ని కొనసాగించండి. ధైర్యం, బలంతో ఉండండి. మీ వైఖరిపై స్థిరంగా నిలబడండి” అని ఖమేనీ పోస్ట్‌లో రాశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు, ఇజ్రాయెల్ భీరక దాడులు కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ లొంగిపోయే పరిస్థితి కనిపించడం లేదని ఖమేనీ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేస్తూ.. ఇరాన్ ఎవరికీ భయపడదని నిరూపించడానికి ప్రయత్నిస్తోంది.

READ MORE: IND vs ENG: ఇంగ్లాండ్‌కు చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మ్యాచుల షెడ్యూల్ ఇలా..

Exit mobile version