Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
- యూఎన్‌లో గందరగోళం
- నెతన్యాహు రాగానే అలజడి
- ఇరాన్ బృందం వాకౌట్
- పిరికివాళ్లు వెళ్లిపోండి అంటూ ఎద్దేవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు తమ వాదనను వినిపించారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంతు రాగానే సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. నెతన్యాహు ప్రసంగం ప్రారంభించగానే డజన్ల కొద్దీ ప్రతినిధులంతా జనరల్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఇక ఇరాన్ వాకౌట్ చేస్తూ ఖాళీ బల్లపై సులేమానీ చిత్రపటాన్ని ఉంచేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సభ నుంచి వెళ్లిపోయిన వారిని ఉద్దేశించి ‘నైతిక పిరికివాళ్లు’ అంటూ నెతన్యాహు సంబోధించారు.

Also Read
- Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
- Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!
- China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
- Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
గురువారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని మంత్రి నెతన్యాహు ప్రసంగించారు. ప్రసంగం అలా ప్రారంభించారో లేదో వెంటనే టెహ్రాన్ బృందం తమకు కేటాయించిన బల్లపై ఖాసిమ్ సులేమానీ చిత్రపటాన్ని వదిలేసి వెళ్లిపోయారు. చాలా వేగంగా సభ నుంచి వెళ్లిపోయారు. కొంత మంది హేళన చేస్తూ మాట్లాడారు. అయితే నెతన్యాహు మద్దతుదారులు మాత్రం సభలో నిలబడి చప్పట్లతో కొడుతూ ఉత్సాహపరిచారు. దీంతో మిగిలిన నిరసనకారులంతా వెళ్లిపోవాలని నెతన్యాహు సూచించారు. ఈ సభలో విడిచి వెళ్లని నైతిక పిరికివాళ్లు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు.
ఇక నెతన్యాహు తన ప్రసంగంలో ఇజ్రాయెల్ చర్యలను సమర్థించారు. ఇరాన్ నాయకత్వాన్ని హంతక నియంతృత్వంగా అభివర్ణించారు. టెహ్రాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా ఇజ్రాయెల్ అడ్డుకుందని తెలిపారు. చివరికి ఇరాన్ ప్రభుత్వం పతనమైందని పేర్కొన్నారు. ఇక ప్రసంగిస్తుండగా నెతన్యాహు ఒక వస్తువును చూపించి స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ పరికరాన్ని పైకి పట్టుకుని ఇరాన్ ప్రతినిధి బృందానికి అందజేయాలని కోరారు. తన మాటల్లో చెప్పాలంటే.. ఇరాన్ అధికారులు చివరికి సోషల్ మీడియాలో తమ కథను స్వేచ్ఛగా చెప్పగలరని తెలిపారు.
ఇక నెతన్యాహు పనిలో పనిగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, న్యూయార్క్ మేయర్ మమ్దానీ సహా పలువురు అంతర్జాతీయ విమర్శకులపై కూడా విమర్శలు గుప్పించారు. ఇక అక్టోబర్ 27న ఇజ్రాయెల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యూఎన్‌లో నెతన్యాహు చేసిన ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.
సులేమానీ.. 2020 జనవరిలో బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో అమెరికా డ్రోన్ దాడిలో మరణించాడు. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఈ దాడి జరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
-
Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
-
రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
-
Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!