China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
- చైనా నుంచి అమెరికాకు అరుదైన బహుమతి
- స్నేహానికి దూతలుగా రెండు పాండాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xi Jinping Announces New Giant Pandas for Atlanta Zoo: అమెరికా-చైనా సంబంధాల్లో పాండా డిప్లొమసీ మరోసారి తెరపైకి వచ్చింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా రెండు జెయింట్ పాండాలను అట్లాంటా జూకు పంపనున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పాండాలు చైనా, అమెరికా ప్రజల మధ్య స్నేహానికి ‘దూతలు’గా ఉంటాయని జిన్‌పింగ్ పేర్కొన్నారు. అట్లాంటా జూకు రానున్న పాండాల్లో ఒకటి మగ పాండా Ping Ping, మరొకటి ఆడ పాండా Fu Shuang. వీరిద్దరూ చైనాలోని చెంగ్డూ రీసెర్చ్ బేస్ ఆఫ్ జెయింట్ పాండా బ్రీడింగ్‌లో జన్మించారు.
ఈ రెండు పాండాలను అట్లాంటా జూకు పంపేందుకు China Wildlife Conservation Associationతో Zoo Atlanta ఏప్రిల్ 2026లో కొత్త అంతర్జాతీయ సహకార పరిశోధనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జిన్‌పింగ్ తాజా ప్రకటన ప్రకారం Ping Ping, Fu Shuang రాబోయే రోజుల్లో అట్లాంటాకు చేరుకోనున్నాయి. అయితే వాటి ఖచ్చితమైన రాక తేదీని జూ అధికారులు ఇంకా వెల్లడించలేదు.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
అమెరికా-చైనా స్నేహానికి ప్రతీకగా పాండాలు
పాండాలను చైనా చాలాకాలంగా దౌత్య సంబంధాల్లో స్నేహానికి ప్రతీకగా ఉపయోగిస్తోంది. జిన్‌పింగ్ కూడా ఈ రెండు పాండాలు రెండు దేశాల మధ్య స్నేహాన్ని కొనసాగించడంతో పాటు సహకారాన్ని విస్తరించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. పాండాల పరిరక్షణ, పరిశోధనలో రెండు దేశాల మధ్య సహకారాన్ని కొనసాగించడం కూడా ఈ ఒప్పందంలో కీలక అంశంగా ఉంది.
1972 నుంచి కొనసాగుతున్న ‘పాండా డిప్లమసీ’
అమెరికా-చైనా సంబంధాల్లో పాండాల కథ కొత్తది కాదు. 1972లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ చైనాను సందర్శించిన సమయంలో చైనా అమెరికాకు Ling-Ling, Hsing-Hsing అనే రెండు పాండాలను అందించింది. అవి వాషింగ్టన్‌లోని నేషనల్ జూలో ప్రముఖ ఆకర్షణగా నిలిచాయి. ఈ సంప్రదాయానికే తర్వాత ‘Panda Diplomacy’ అనే పేరు వచ్చింది. అట్లాంటా జూతో చైనా గతంలో కూడా దీర్ఘకాలిక పాండా పరిరక్షణ భాగస్వామ్యాన్ని కొనసాగించింది. 1999లో ప్రారంభమైన ఆ ఒప్పందం 2024లో ముగిసింది. ఆ 25 ఏళ్ల భాగస్వామ్యంలో అట్లాంటాలో ఏడు పాండా పిల్లలు జన్మించాయి.
రెండేళ్ల తర్వాత మళ్లీ అట్లాంటాకు పాండాలు
2024లో అట్లాంటా జూలో ఉన్న పాండాలు చైనాకు తిరిగి వెళ్లిన తర్వాత అక్కడ జెయింట్ పాండాలు లేకుండా పోయాయి. ఇప్పుడు Ping Ping, Fu Shuang రాకతో దాదాపు రెండేళ్ల విరామం తర్వాత అట్లాంటా జూలో మళ్లీ పాండాలను చూసే అవకాశం ఏర్పడుతోంది.
ట్రంప్- జిన్‌పింగ్ భేటీలో పాండా ప్రకటన
జిన్‌పింగ్ అమెరికా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు, సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. అదే సమయంలో పాండాలను అట్లాంటాకు పంపుతున్నట్లు జిన్‌పింగ్ ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ‘పాండా డిప్లమసీ’ మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.
తాజావార్తలు
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..