ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య మరోసారి తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల సిరియాలోని దమస్కు పట్టణంలో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ వైమానిక దాడి తర్వాత మరింత ప్రమాదకరంగా మారింది. ఈ ఘటనలో పలువురు ఇరానీయులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇజ్రాయిల్‌పై ఇరాన్ రగిలిపోతుంది. ఇప్పటికే హమాస్‌పై దాడి తర్వాత ఇజ్రాయిల్‌పై పగతో ఇరాన్ మండిపోతుంది. తాజా ఘటనతో అది కాస్తా ముదిరింది.
ఇజ్రాయెల్‌పై ప్రతి దాడికి ఇరాన్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్.. అమెరికాను హెచ్చరించింది. తాము ఇజ్రాయిల్‌పై యుద్ధానికి దిగబోతున్నామని.. ఈ విషయంలో అమెరికా దూరంగా ఉండాలని వార్నింగ్ జారీ చేసింది. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా ఇరాన్ సందేశం పంపింది. యుద్ధం విషయంలో అమెరికా జోక్యం చేసుకోవద్దని.. అప్పుడే మీరు సురక్షితంగా ఉండగలరని అమెరికాకు ఇరాన్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Cloves Trouble: లవంగాలు అస్సలు తినకండి.. లేదంటే..!
ఇరాన్ హెచ్చరికలపై అమెరికా స్పందించింది. తమ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయరాదని కోరినట్లు ఇరాన్ అధ్యక్షుడి రాజకీయ వ్యవహారాల అధికారి మొహమ్మద్ జంషిది తెలిపారు. కానీ అమెరికా మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరీ ఇరాన్ హెచ్చరికలపై యూఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Sarangadariya : ‘సారంగదరియా’ నుంచి ‘అందుకోవా’ సాంగ్ రిలీజ్..
సిరియా రాజధాని దమాస్క్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇటీవల వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇరాన్ సైన్యానికి చెందిన ఇద్దరు మిలిటరీ కమాండర్లతో పాటు పాటు 13 మంది మరణించారు. మరోవైపు ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చెప్పారు. ఇరాన్ దాడులకు దిగుతుందనే భయంతో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. జీపీఎస్ నావిగేషన్‌ను నిలిపివేసింది. తమ సైనికులకు ఇచ్చిన సెలవులను రద్దు చేసింది. రక్షణ సామర్ధ్యాన్ని విస్తరించింది. తన సరిహద్దులన్నింటిలో బలగాలను మోహరించింది. ముందు జాగ్రత్తగా అన్నిచోట్ల బాంబు షెల్టర్‌లను తెరిచింది.
ఇది కూడా చదవండి: BJP Founder Day: కార్యకర్తలకు మోడీ, అమిత్ షా, నడ్డా శుభాకాంక్షలు