Iran Prince Reza Pahlavi: ఇరాన్ బహిష్కృత నేత రెజా పహ్లవిపై దాడి.. వీడియో వైరల్
జర్మనీలోని బెర్లిన్‌లో ఇరాన్ ప్రవాస యువరాజు రెజా పహ్లవిపై అకస్మాత్తుగా దాడి జరిగింది. వెనుక నుంచి ఒకరు ఎర్రటి టమాటో జ్యూస్ విసిరాడు. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇరాన్-అమెరికా మధ్య భీకర యుద్ధం జరిగింది. ఇరాన్‌లో పాలన మారాలంటూ రెజా పహ్లవి పిలుపునిచ్చారు. అరాచక ఖమేనీ పాలన పోవాలని.. అందుకోసం తన మద్దతు దారులు పోరాడాలని కోరారు. గతేడాది డిసెంబర్ 28 నుంచి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అనంతరం ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ 40 రోజుల పాటు సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు.
Also Read
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
- PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
- Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
- Assembly Elections: తమిళనాడు, బెంగాల్‌లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్
ఇదిలా ఉండగా రెహ పహ్లవి ప్రస్తుతం జర్మనీలో పర్యటిస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రెస్‌మీట్ నిర్వహించారు. అనంతరం ఒక బిల్డింగ్‌లో నుంచి బయటకు వచ్చి ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఒక ఇరానీయుడు వెనుక నుంచి వచ్చి టమాటో జ్యూస్‌తో దాడి చేశాడు. తల వెనుక భాగం, మెడ, బ్లేజర్‌పై పడింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై 65 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
టెహ్రాన్‌లోని పాలకవర్గంపై ఐరోపా దేశాలు ఒత్తిడి తీసుకురావాలని రెజా పహ్లవి కోరారు. ‘‘యూరప్ చేయగలిగేవి చాలా ఉన్నాయి. కానీ అవి చేయలేదు… ఉరిశిక్షలను ఆపమని ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఏమీ చేయలేదు. రాజకీయ ఖైదీలను విడుదల చేయమని వారిపై ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఏమీ చేయలేదు.’’ అని విమర్శించారు. ఇక జర్మనీ పర్యటనకు ముందు బుధవారం సాయంత్రం ఎక్స్ పోస్ట్‌లో ‘‘తమ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఇరానీయులకు స్వరంగా ఉండేందుకు తాను బెర్లిన్‌ను సందర్శిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Iran Prince Reza Pahlavi: ఇరాన్ బహిష్కృత నేత రెజా పహ్లవిపై దాడి.. వీడియో వైరల్
-
MI vs CSK: వాంఖెడేలో తిలక్ వర్మ – జేమీ ఓవర్టన్ మధ్య మాటల యుద్ధం.. వీడియో వైరల్.!
-
Friday Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.!
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!