Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Iran Mocks Trump Uranium Claim As Castles In The Air Nuclear Talks Hit Roadblock

Iran-Trump: ‘గాలి మేడలు కట్టొద్దు’.. ట్రంప్ యురేనియం వ్యాఖ్యలపై ఇరాన్ సెటైర్

Published Date :April 17, 2026 , 11:23 am
By Suresh Maddala
  • ‘గాలి మేడలు కట్టొద్దు’
  • ట్రంప్ యురేనియం వ్యాఖ్యలపై ఇరాన్ సెటైర్
  • పర్షియన్ సామెత ఉపయోగించిన ఇరాన్
Iran-Trump: ‘గాలి మేడలు కట్టొద్దు’.. ట్రంప్ యురేనియం వ్యాఖ్యలపై ఇరాన్ సెటైర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

యురేనియం మొత్తం అమెరికాకు అప్పగించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని వైట్‌హౌస్ వేదికగా ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఇరాన్ మీడియా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రభుత్వ ప్రసార సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ (IRIB), తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్రంప్ ఇటీవలి వ్యాఖ్యల క్లిప్‌ను పంచుకుంటూ పర్షియన్ భాషలో ట్రంప్‌ను ఎగతాళి చేసింది. గాల్లో మేడలు కట్టొద్దని హితవు పలికింది. ‘‘ఒంటె పత్తి గింజల గురించి కలలు కంటుంది. కొన్నిసార్లు వాటిని మింగేస్తుంది. మరికొన్నిసార్లు గింజగింజగా తింటుంది!”. అని వ్యాఖ్యానించింది. వాస్తవానికి దూరంగా కలల్లో జీవించడం వంటి భావాన్ని తెలియజేస్తుంది.

ట్రంప్ ఏమన్నారంటే..
ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం మొత్తం అమెరికాకు అప్పగించేందుకు అంగీకరించిందని బిగ్ ప్రకటన చేశారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘వాళ్లు న్యూక్లియర్ డస్ట్ (సుసంపన్న యురేనియం నిల్వ) మాకు తిరిగి ఇవ్వడానికి అంగీకరించారు.’’ అని తెలిపారు. ఈ అంశంపై రెండు దేశాలు ఒక ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయని స్పష్టం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం కుదిరితే అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. అంతేకాదు.. ఒకవేళ ఒప్పందం ఇస్లామాబాద్‌లో జరిగితే పాకిస్థాన్‌కు కూడా వెళ్తానని ట్రంప్ సూచించారు.

గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య 21 గంటల పాటు చర్చ జరిగింది. అయితే చర్చలు ఫలించకపోవడంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. యురేనియం శుద్ధిని 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేయగా.. ఇరాన్ ఐదు సంవత్సరాల వరకు మాత్రమే అంగీకరిస్తామని తెగేసి చెప్పింది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. అమెరికా నిర్దేశించిన “రెడ్ లైన్స్” పాటిస్తే ఈ ఒప్పందం రెండు దేశాలకు లాభదాయకంగా ఉంటుందన్నారు. అయితే ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని.. అంతే తప్ప అణు ఆయుధాలు తయారు చేసే ఉద్దేశ్యం లేదని పేర్కొంది.

అయితే రెండో విడత చర్చల కోసం వాషింగ్టన్ ఆదేశాల మేరకు ఇరాన్ ఒప్పించేందుకు పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఇరాన్‌లో పర్యటిస్తున్నారు. రెండు, మూడు రోజుల నుంచి టెహ్రాన్‌లో కీలక నేతలతో సమావేశమై చర్చిస్తున్నారు. గురువారం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిభాఫ్‌తో సమావేశమై శాంతి చర్చలపై చర్చించారు. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ప్రకారం.. అసిమ్ మునీర్.. రివల్యూషనరీ గార్డ్స్ కేంద్ర ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించి ఇరాన్ కమాండర్లతో కీలక అంశాలపై చర్చించారు. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ఇతర నాయకులతో కూడా సమావేశమయ్యారు. అయితే రెండో విడత చర్చలపై మాత్రం ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇక ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది.

 

Building castles in the air!

Or in Persian we have a similar proverb:
'The camel dreams of cottonseed; sometimes gulping it down, sometimes eating it grain by grain!'

شتر در خواب بیند پنبه‌دانه
گهی لپ‌لپ خورد گه دانه دانه pic.twitter.com/HA15h1aQVU

— IRIB (Islamic Republic of Iran Broadcasting) (@iribnews_irib) April 16, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • castles in the air Iran response
  • global politics Iran US news
  • Iran mocks Trump statement
  • Iran nuclear program news
  • Iran Trump uranium deal

తాజావార్తలు

  • SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్‌కేపై ఎస్‌ఆర్‌హెచ్ సూపర్ విక్టరీ..

  • Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్‌నే మించిపోయాడు.. ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!

  • Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ అక్కడ కూడా ఫ్లాపేనా?

  • Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్

  • Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్‌ ఇచ్చేశాడా?

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions