Iran Execution: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొస్సాద్’ కోసం పని చేస్తున్నాడనే ఆరోపణలతో కురుష్ కీవాని అనే వ్యక్తికి ఇరాన్ ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని విదేశీ శక్తులకు చేరవేసినట్లు సాక్ష్యాధారాలు లభించడంతో ఈ చర్య తీసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
READ ALSO: North Korean Elections: 99.93% మెజారిటీతో కిమ్ పార్టీ గెలుపు.. ఎవరో ఆ 0.07% వ్యతిరేకులు?
నేరారోపణలు ఏమిటంటే..
కురుష్ కీవానిపై వచ్చిన ప్రధాన ఆరోపణలు ఏంటంటే.. ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ ఇరాన్ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించడం, ఇరాన్ భద్రతా రంగానికి చెందిన అత్యంత కీలకమైన, రహస్య సమాచారాన్ని శత్రు దేశానికి అప్పగించడం, ఇరాన్‌లోని అత్యంత సున్నితమైన, నిషేధిత ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలను తీసి, వాటిని మొస్సాద్‌కు పంపడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
చట్టపరమైన చర్యలు
కీవాని అరెస్టు అనంతరం విచారణ చేపట్టిన దిగువ కోర్టు, అతను దేశద్రోహానికి పాల్పడినట్లు నిర్ధారించి మరణశిక్ష విధించింది. ఈ తీర్పును నిందితుడు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసినప్పటికీ, సుప్రీంకోర్టు అన్ని సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించి దిగువ కోర్టు తీర్పునే సమర్థించింది. చట్టపరమైన ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత, జైలు అధికారులు అతనికి ఉరిశిక్షను అమలు చేశారు. ఇజ్రాయెల్ లేదా ఇతర విదేశీ సంస్థల కోసం గూఢచర్యం చేసే వారిపై ఇరాన్ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమైంది.
READ ALSO: 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!
