Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Iran Announces Nuclear Program Termination Us Deal 2026

Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు కార్యక్రమానికి స్వస్తి?

Published Date :March 5, 2026 , 4:19 pm
By Shiva Ganesh
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు కార్యక్రమానికి స్వస్తి?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Iran: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ నుంచి అనూహ్యమైన, అత్యంత కీలకమైన ప్రకటన వెలువడింది. దశాబ్దాలుగా సాగుతున్న అణు వివాదానికి తెరదించేలా ఇరాన్ ఒక అడుగు ముందుకు వేసింది. ఈ పరిణామం ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. తాజాగా ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి ఖతీబ్జాదే చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. అమెరికా నుంచి సరైన, గౌరవప్రదమైన ‘ఆఫర్’ వస్తే, తమ దేశం అణు కార్యక్రమాన్ని పూర్తిగా ముగించడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. స్కై న్యూస్ అరేబియా ఈ మేరకు ఒక నివేదికను ప్రచురించింది. ఈ నివేదికలో ఉన్న కీలకమైన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Nitish Kumar: రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రకటించిన బిహార్ సీఎం.. ప్రస్థానం చూస్తే పరేషాన్ కావాల్సిందే!

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
Add as a preferred
source on google

శాంతి కోసం 12 దేశాల రాయబారం
గతంలో ఇరాన్ కేవలం “యురేనియం సుసంపన్నతను తగ్గించడం” గురించి మాత్రమే మాట్లాడేది. కానీ, చరిత్రలో మొదటిసారిగా మొత్తం అణు కార్యక్రమాన్నే రద్దు చేస్తామని అధికారికంగా ప్రతిపాదించడం గమనార్హం. అమెరికా – ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, ఒక ఒప్పందానికి తీసుకురావడానికి 12 మధ్యప్రాచ్య దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ చర్చలకు టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్ నాయకత్వం వహిస్తున్నారు. ఒమన్, సౌదీ అరేబియా కూడా అమెరికాపై ఒత్తిడి తెస్తూ, ఇరాన్‌తో ఒప్పందం కుదిరేలా ప్రయత్నిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఇప్పటికే అమెరికా – ఇరాన్ ప్రతినిధులు జెనీవా, ఒమన్‌లలో రహస్యంగా భేటీ అయ్యారని వెల్లడించింది.

ఇరాన్ అణు నిల్వలు ఎంత అంటే..
డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇరాన్ అణు సామర్థ్యం ఎంత ఉందంటే..

యురేనియం నిల్వ: ప్రస్తుతం ఇరాన్ వద్ద 460 కిలోగ్రాముల శుద్ధి చేసిన యురేనియం ఉంది.

విధ్వంసక శక్తి: ఈ నిల్వలతో సుమారు 11 అణు బాంబులను తయారు చేసే అవకాశం ఉంది.

శుద్ధి శాతం: ప్రస్తుతం ఈ యురేనియం 60% వరకు శుద్ధి చేశారు. అణ్వాయుధం తయారీకి ఇది 90% కి చేరాల్సి ఉంటుంది.

ఇరాన్- అమెరికా మధ్య చారిత్రక ఒప్పందం కోసం జరుగుతున్న చర్చల్లో ఇరుపక్షాల నుంచి కీలక నేతలు పాల్గొంటున్నారు. ఇరాన్ తరపున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, ఉప మంత్రి ఖతీబ్జాదే పాల్గొంటున్నారు. అమెరికా తరపున స్టీవ్ విట్కాఫ్, డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ చర్చల్లో పాల్గొనే వారిలో ఉన్నారు.

ఇది యుద్ధానికి ముగింపా..
అమెరికా దాడులు తీవ్రతరం చేస్తున్న తరుణంలో ఇరాన్ ఈ ప్రతిపాదన చేయడం గమనార్హం. ఒకవేళ అమెరికా ఈ ఆఫర్‌ను అంగీకరిస్తే, మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గి, శాంతి నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, అమెరికా ఇచ్చే ‘ఆఫర్’ ఎలా ఉంటుందనే దానిపైనే ఈ ఒప్పంద భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు. చూడాలి అమెరికా- ఇరాన్ ఇచ్చిన ఆఫర్‌పై ఎలా స్పందిస్తుందో అనేది.

READ ALSO: Gravity Nuclear Bombs: ఇరాన్ నామరూపాలు లేకుండా చేసేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్ ఇదే!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 460kg Enriched Uranium Iran
  • Hakan Fidan Iran Mediator
  • Iran Nuclear Offer to US.
  • Iran Nuclear Program Termination
  • Iran US Peace Deal 2026

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions