Pollution Report: భారత్‌కు స్వల్ప ఊరట.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో అత్యంత దారుణం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pollution Report: ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారిందని IQAir నివేదిక స్పష్టం చేసింది. తాజాగా ఈ సంస్థ 2024-25 సంబంధించిన ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో దక్షిణ ఆసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు ఈ సంక్షోభానికి కేంద్ర బిందువులుగా మారాయి. ఈ ప్రాంతాల్లోని నగరీకరణ, పరిశ్రమల పెరుగుదల, వాతావరణ మార్పులు వాయు కాలుష్యాన్ని మరింత ఉధృతంగా మారుస్తున్నాయని పేర్కొంది.
Read Also: IMF: పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ నిధులు విడుదల
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ఇక నివేదిక ప్రకారం భారత్‌లో 2023లో సగటు PM2.5 స్థాయి 54.4 µg/m³గా ఉండగా, తాజా నివేదికలో అది 50.6 µg/m³కి తగ్గింది. దీంతో భారత్ ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన దేశాల్లో మూడవ స్థానం నుండి ఈ ఏడాది అయిదవ స్థానానికి దిగజారింది. ఇది స్వల్ప మెరుగుదలకే సంకేతం. అయినా, ఇంకా చాలా మెరుగు పడాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్తాన్ మాత్రం అత్యంత కాలుష్యిత దేశాల జాబితాలో వరుసగా రెండవ, మూడవ స్థానాల్లో నిలిచాయి. పాకిస్తాన్‌లో సగటు PM2.5 స్థాయి 73.7 µg/m³కి చేరుకుంది. ఇది అత్యంత తీవ్రమైన ఆరోగ్య ముప్పుగా పరిగణించబడుతుంది. వాయు కాలుష్యం గుండె సమస్యలు, ఆస్థమా, కేన్సర్ వంటి ప్రాణాంతక రోగాలకు ప్రధాన కారణమని నివేదిక చెబుతోంది.
Read Also: IND-PAK Tension: ప్రధాని మోడీ అధ్యక్షతన హైలెవల్ మీటింగ్..
ఇక IQAir నివేదిక ప్రకారం ఐస్‌లాండ్, న్యూజిలాండ్, ఫిన్లాండ్ వంటి దేశాలు తక్కువ కాలుష్య స్థాయిని కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ఈ దేశాలు గ్రీన్ పాలసీలను, పర్యావరణ పరిరక్షణ చర్యలను సమర్థంగా అమలు చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. IQAir నివేదిక దక్షిణ ఆసియాలోని దేశాలు తమ వాతావరణ విధానాలను పునఃపరిశీలించి, స్థిరమైన అభివృద్ధి మార్గాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు దీర్ఘకాలిక చర్యలు, కఠిన నిబంధనలు, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని పేర్కొంది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!