Hyderabad CP: హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియామకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kothakota Srinivas Reddy appointed as Hyderabad CP: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐపీఎస్ బదిలీలకు మొదటిసారి శ్రీకారం చుట్టుంది. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐదుగురు ఐపీఎస్ అధికారుల బదిలీలు మంగళవారం జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ (సీపీ)గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాచకొండ సీపీగా సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పాత సీపీ సందీప్ శాండిల్యాను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్‌గా నియమించింది. మరోవైపు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ చౌహన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం (ఈసీ) సీవీ ఆనంద్‌పై బదిలీ వేటు వేసిన తర్వాత హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యా నియమితులయిన విషయం తెలిసిందే.
Also Read
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్‌కు ముప్పు తప్పదా?
Also Read:
Gas Cylinder: రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ను 100 రోజుల్లో అమలుచేస్తాం: ఉత్తమ్
సీవీ ఆనంద్‌పై బదిలీ వేటు వేసిన తర్వాత హైదరాబాద్ సీపీ రేసులో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపించాయి. సందీప్ శాండిల్యతో పాటు సంజయ్‌కుమార్ జైన్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పేర్లు వినిపించాయి. వీరిలో శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తారని అందరూ భావించారు. అయితే ఈసీ ఆదేశాల మేరకు హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి సీపీగా బాధ్యతలు చేపట్టారు.
తాజావార్తలు
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్‌కు ముప్పు తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!