Site icon NTV Telugu

IND vs ZIM: తొలి మ్యాచ్లోనే విఫలమైన ఐపీఎల్ స్టార్లు..

Match

Match

జింబాబ్వే టూర్‌లో పలువురు యువ ఆటగాళ్లకు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ పర్యటనలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్‌మన్ గిల్ మొదటి మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లకు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చాడు. కానీ ఈ ముగ్గురిలో ఎవరూ బ్యాటింగ్ లో రాణించలేకపోయారు. తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురైల్‌లు టీమిండియా తరఫున అరంగేట్రం చేసినా తొలి మ్యాచ్‌లో ముగ్గురూ విఫలమయ్యారు. ఈ ముగ్గురికి ఈ మ్యాచ్‌లో హీరోలుగా నిలిచే అవకాశం లభించింది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు.

అభిషేక్ ఖాతా తెరవలేకపోయాడు
ఐపీఎల్‌లో తుఫాను బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఖాతా తెరవలేకపోయాడు. తొలి ఓవర్‌లోనే అతని వికెట్‌ కోల్పోయాడు. బ్రియాన్ బెన్నెట్ వేసిన నాలుగో బంతికి మసకద్జా చేతికి చిక్కాడు. కాగా.. ఐపీఎల్‌లో అభిషేక్ అత్యధిక స్ట్రైక్ రేట్ 200తో పరుగులు చేసిన సంగతి తెలిసిందే..

రియాన్ పరాగ్ కూడా విఫలమయ్యాడు
అలాగే.. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ కూడా అరంగేట్రం మ్యాచ్‌లో విఫలమయ్యాడు. భారత్ 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో పరాగ్ రంగంలోకి దిగాడు. అప్పటికే.. అభిషేక్, రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు. పరాగ్ తొందరపడి తన మూడో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి మరీ బౌన్స్ అవడంతో క్యాచ్ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు. పరాగ్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు.

ధృవ్ జురైల్
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధ్రువ్ జురైల్.. టీ20 అరంగేట్రంలో భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించలేకపోయాడు. జురైల్ మైదానంలోకి వచ్చేసరికి భారత్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. గిల్ ఓ పక్కన నిదానంగా జట్టుకు పరుగులు సమకూరుస్తున్నాడు. అయితే.. అతనికి మద్దతు ఇవ్వాల్సిన సమయమది. జోంగ్వే వేసిన బౌలింగ్ లో తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. 14 బంతులు ఆడిన అతను కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు.

Exit mobile version