IND vs ZIM: తొలి మ్యాచ్‌లోనే విఫలమైన ఐపీఎల్ స్టార్లు..
- తొలి మ్యాచ్‌లోనే విఫలమైన ఐపీఎల్ స్టార్లు
- రాణించని అభిషేక్.. పరాగ్.. ధ్రువ్ జురేల్
- అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లో ముగ్గురూ విఫలం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జింబాబ్వే టూర్లో పలువురు యువ ఆటగాళ్లకు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ పర్యటనలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్‌మన్ గిల్ మొదటి మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లకు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చాడు. కానీ ఈ ముగ్గురిలో ఎవరూ బ్యాటింగ్ లో రాణించలేకపోయారు. తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురైల్లు టీమిండియా తరఫున అరంగేట్రం చేసినా తొలి మ్యాచ్‌లో ముగ్గురూ విఫలమయ్యారు. ఈ ముగ్గురికి ఈ మ్యాచ్‌లో హీరోలుగా నిలిచే అవకాశం లభించింది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు.
అభిషేక్ ఖాతా తెరవలేకపోయాడు
ఐపీఎల్లో తుఫాను బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఖాతా తెరవలేకపోయాడు. తొలి ఓవర్లోనే అతని వికెట్ కోల్పోయాడు. బ్రియాన్ బెన్నెట్ వేసిన నాలుగో బంతికి మసకద్జా చేతికి చిక్కాడు. కాగా.. ఐపీఎల్లో అభిషేక్ అత్యధిక స్ట్రైక్ రేట్ 200తో పరుగులు చేసిన సంగతి తెలిసిందే..
Also Read
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
రియాన్ పరాగ్ కూడా విఫలమయ్యాడు
అలాగే.. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ కూడా అరంగేట్రం మ్యాచ్‌లో విఫలమయ్యాడు. భారత్ 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో పరాగ్ రంగంలోకి దిగాడు. అప్పటికే.. అభిషేక్, రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు. పరాగ్ తొందరపడి తన మూడో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి మరీ బౌన్స్ అవడంతో క్యాచ్ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు. పరాగ్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు.
ధృవ్ జురైల్
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధ్రువ్ జురైల్.. టీ20 అరంగేట్రంలో భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించలేకపోయాడు. జురైల్ మైదానంలోకి వచ్చేసరికి భారత్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. గిల్ ఓ పక్కన నిదానంగా జట్టుకు పరుగులు సమకూరుస్తున్నాడు. అయితే.. అతనికి మద్దతు ఇవ్వాల్సిన సమయమది. జోంగ్వే వేసిన బౌలింగ్ లో తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. 14 బంతులు ఆడిన అతను కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు.
తాజావార్తలు
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!