జింబాబ్వే టూర్‌లో పలువురు యువ ఆటగాళ్లకు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ పర్యటనలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్‌మన్ గిల్ మొదటి మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లకు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చాడు. కానీ ఈ ముగ్గురిలో ఎవరూ బ్యాటింగ్ లో రాణించలేకపోయారు. తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురైల్‌లు టీమిండియా…
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ పేలవమైన ప్రదర్శన కారణంగా తరచూ ట్రోల్ అవుతుంటాడు. కానీ రియాన్ దేవధర్ ట్రోఫీలో తనపై వచ్చిన ట్రోల్స్కు తగిన సమాధానం ఇచ్చాడు. రియాన్ దేవధర్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతూ.. 5 రోజుల్లో రెండు సెంచరీలు సాధించాడు. మంగళవారం వెస్ట్ జోన్‌పై రియాన్ 68 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ఇది అతనికి రెండో సెంచరీ. అంతకుముందు జూలై 28న…
పూణె వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఆదిలోనే ఆ జట్టు వరుస వికెట్లను కోల్పోయింది. బట్లర్ (8), పడిక్కల్ (7) విఫలమయ్యారు. ఈ దశలో కెప్టెన్ సంజు శాంసన్ (27) కొంచెం సహనంగా ఆడాడు. అయితే మళ్లీ వరుస వికెట్లు పడటంతో రాజస్థాన్ స్వల్ప…