KKR Captain: కేకేఆర్ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా టీమిండియా నయా సంచలనం!
- ఆరుగురిని రిటైన్ చేసుకున్న కేకేఆర్
- టాప్ ప్లేయర్‌గా రింకూ సింగ్
- కేకేఆర్ రిటెన్షన్‌కు ఒప్పుకోని శ్రేయస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలంకు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ప్రాంచైజీ ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్‌ను టాప్ ప్లేయర్‌గా రూ.13 కోట్లకు అట్టిపెట్టుకుంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, డేంజరస్ హిట్టర్ ఆండ్రీ రసెల్‌లను రూ.12 కోట్లకు రిటైన్ చేసుకుంది. భారత ప్లేయర్స్ హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్‌లను రూ.4 కోట్లుకు అట్టిపెట్టుకుంది. కేకేఆర్ రూ.63 కోట్లతో వేలంలోకి వెళ్లనుంది.
2024 ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ వేలంలోకి వదిలేసిన విషయం తెలిసిందే. కేకేఆర్ రిటెన్షన్‌కు శ్రేయస్ ఒప్పుకోలేదని సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ సూచనలతోనే కోల్‌కతాను వీడినట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ స్థానంలో మరోసారి ఢిల్లీకి శ్రేయస్ సారథిగా వ్యవహరించనున్నాడని ప్రచారం జరుగుతోంది. శ్రేయస్ జట్టును వీడడంతో కోల్‌కతాకు కెప్టెన్ అవసరం ఏర్పడింది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వేలంలో ఉన్నా.. వీరిద్దరూ కోల్‌కతాకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పంజాబ్ కింగ్స్‌కు పంత్.. ఆర్సీబీకి కేఎల్ రాహుల్ వెళ్లే ఛాన్స్ ఉంది.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
Also Read: Delhi AQI: ఢిల్లీలో 400 దాటిన ఏక్యూఐ.. అసౌకర్యానికి గురవుతున్న ప్రజలు!
ప్రస్తుతం కెప్టెన్సీ ఆప్షన్ ఉన్న భారత ఆటగాళ్లు కోల్‌కతాకు లేకుండా పోయారు. దాంతో జట్టులో ఉన్న రింకూ సింగ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు చేస్తోందని తెలిసింది. రింకూకు ఇప్పటివరకు కెప్టెన్సీ అనుభవం లేదు. కనీసం దేశవాళీ క్రికెట్లో కూడా సారథిగా వ్యవహరించలేదు. అలాంటి రింకూ డిపెండింగ్ ఛాంపియన్ జట్టును ముందుకు తీసుకెళ్లడం కత్తిమీద సామే అనే చెప్పాలి. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..