Mumbai Indians: హార్దిక్ పాండ్యా పరిపూర్ణమైన కెప్టెన్ కాదు.. రోహిత్ శర్మకు ముందే తెలిసి ఉంటుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma praised by Aakash Chopra: ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ అభిమానులకు వరుస షాక్స్ ఇస్తోంది. ముందుగా గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా తీసుకుని.. ఆపై కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో అతడిని నియమించింది. దాంతో పాండ్యాను కెప్టెన్‌గా నియమించడం కోసం రోహిత్‌ను తప్పించడం సరికాదని సోషల్ మీడియాలో ఫాన్స్ మండిపడుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలో హార్దిక్ కెప్టెన్సీపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా పరిపూర్ణమైన కెప్టెన్ కాదు అని పేర్కొన్నాడు.
ఆకాశ్‌వాణిలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ… ‘నాకు తెలిసి ముంబై జట్టుకు కెప్టెన్సీ ఇస్తామనే హామీతోనే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ టీంను వీడాడు. ఈ విషయం తప్పకుండా రోహిత్ శర్మకు తెలిసే ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికల గురించి రోహిత్‌తో ముంబై యాజమాన్యం చర్చించి ఉంటుంది. గుజరాత్ కెప్టెన్‌గా హార్దిక్ సక్సెస్ కావడంలో ఆశిష్ నెహ్రా కీలక పాత్ర పోషించాడు. మైదానంలో వారి మధ్య సమన్వయం మనం చాలాసార్లు చూశాం. ఇప్పుడు ముంబై చేయాల్సింది కూడా ఇదే. హార్దిక్‌కు సహకరించాల్సిన బాధ్యత ముంబైపై ఉంది. అప్పుడే మైదానంలో అనుకున్న ఫలితాలు వస్తాయి. ఎందుకంటే హార్దిక్ ఇంకా పరిపూర్ణమైన కెప్టెన్‌గా మారలేదనేది నా అభిప్రాయం’ అని అన్నాడు.
Also Read
- Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
‘రోహిత్ శర్మ దిగ్గజ క్రికెటర్ మాత్రమే కాదు గొప్ప కెప్టెన్. ఐపీఎల్‌లో 10 ఏళ్లు జట్టును నడిపించి ఐదు టైటిళ్లను అందించాడు. ముంబై జట్టు కోసం చాలా శ్రమించాడు. అయితే ఏదో ఒక దశలో భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి ఉంటుంది. గత రెండేళ్లలో ముంబై ప్రదర్శన గొప్పగా లేదు. అందుకే మరొకరికి అవకాశం ఇవ్వాలని యాజమాన్యం భావించి ఉంటుంది. ఇదే సరైన సమయమని హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చింది. ఇది కఠిన నిర్ణయమే. అయితే రోహిత్ స్వయంగా కెప్టెన్సీపై నిర్ణయం తీసుకుంటే బాగుండేదని, ఐపీఎల్ 2024లో కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా సారథ్యం వహించేలా చేస్తే బాగుండేదన్న సలహాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాటిపై నేను స్పందించను. ఒకటి మాత్రం చెప్పగలను.. వ్యక్తిగతం కంటే జట్టే ముఖ్యం’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకోచ్చాడు.
తాజావార్తలు
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..