IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలంలో రికార్డు ధర పలికేది వీరికే.. ప్రపంచకప్ హీరో కంటే రవీంద్రకే ఎక్కువ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Ashwin Says Travis Head Get 4 Crores in IPL Auction 2024: ఐపీఎల్ 2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది. మంగళవారం దుబాయ్ వేదికగా ఈ క్యాష్‌రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ వేలంలో భారత్‌తో సహా 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ప్లేయర్స్ పాల్గొననున్నారు. ప్రస్తుతం 10 జట్లలో 77 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేలంలో కోట్లు కొల్లగొట్టేది ఎవరు? అని మాజీ క్రికెటర్లతో పాటు ఫాన్స్ జోరుగా చర్చించుకుంటున్నారు. తాజాగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మినీ వేలంలో అత్యధిక ధర పలికేది ఎవరో జోస్యం చెప్పాడు. యాష్ జోస్యం ప్రకారం వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ కంటే న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర భారీ ధరకు అమ్ముడుపోతాడట.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఆర్ అశ్విన్ క్రికెట్ షాట్లు ఆడుతూ ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఎవరు ఎంత ధరకు అమ్ముడుపోతారో అంచనా వేశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రూ. 14 కోట్లకు పైనే ధర పలుకుతారని యాష్ చెప్పాడు. భారత యువ ఆటగాడు షారుక్ ఖాన్, శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగలు రూ. 10 నుంచి 14 కోట్ల వరకు అమ్ముడవుతారని పేర్కొన్నాడు. భారత పేసర్ హర్షల్ పటేల్, దక్షిణాఫ్రికా పేస్ సంచలనం గెరాల్డ్ కొయెట్జీలు రూ. 7-10 కోట్ల మధ్య అమ్ముడుపోతారని అశ్విన్ తెలిపాడు.
Also Read
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
Also Read: IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలంకు మహిళా ఆక్షనీర్.. ఇదే మొదటిసారి!
వన్డే ప్రపంచకప్ 2023లో అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర, భారత పేసర్ ఉమేశ్ యాదవ్, వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు రొవ్‌మన్ పావెల్ రూ.4 నుంచి 7 కోట్ల ధర పలికే అవకాశముందని ఆర్ అశ్విన్ అంచనా వేశాడు. ఆస్ట్రేలియా ప్రపంచకప్ హీరో ట్రావిస్ హెడ్ రూ.4 కోట్ల వరకూ పలుకుతాడని యశ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా ప్రపంచకప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన హెడ్ కేవలం 4 కోట్లకే అమ్ముడవుతాడా? అని యాష్‌ని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ వేలంలో హెడ్ భారీ ధరకు అమ్ముడుపోతాడనే అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!