MI vs GT: రోహిత్ భాయ్ వస్తున్నాడు.. గుజరాత్ మ్యాచ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న హిట్‌మ్యాన్!
MI vs GT: ముంబై ఇండియన్స్ అభిమానులకు అదిరిపోయే వార్త అందింది. ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై జట్టుకు, కీలక ఆటగాడు రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే కీలక అప్డేట్ ఇచ్చారు. నిజానికి పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న ముంబై ఇండియన్స్‌కు గాయాల బెడద పెద్ద సమస్యగా మారింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురవ్వగా, మిచెల్ సాంట్నర్ అనారోగ్యం కారణంగా గత మ్యాచ్‌కు దూరమయ్యారు. అయితే నేడు గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే కీలక పోరుకు ముందు కోచ్ వీరిద్దరి రీఎంట్రీ విషయంలో సానుకూల సంకేతాలిచ్చారు.
READ ALSO: Dhurandhar 2: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్… అన్ స్టాపబుల్ బాక్సాఫీస్ ‘ధురంధర్’ రివెంజ్!
కోచ్ పారస్ మాంబ్రే ఏమన్నారంటే..
ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పారస్ మాంబ్రే మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ, సాంట్నర్ ఇద్దరూ ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నారు. రోహిత్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. సాంట్నర్ కూడా పూర్తిగా కోలుకున్నారు” అని అన్నారు. అయితే రోహిత్ మైదానంలోకి దిగడంపై ఇంకా చిన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు కూడా రోహిత్ ప్రాక్టీస్ చేసినప్పటికీ, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం హిట్‌మ్యాన్ కోలుకోవడానికి మరో ఒకటి రెండు మ్యాచ్‌లు పడుతుందని చెప్పారు. దీనిని బట్టి చూస్తే రోహిత్ పూర్తిగా 100% ఫిట్‌గా ఉంటేనే బరిలోకి దిగే అవకాశం ఉంది. నేడు (సోమవారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై తలపడనుంది. నిజానికి ఈ స్టేడియంలో మ్యాచ్ ముంబైకి అసలు కలిసిరావడం లేదు. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో ముంబై ఒక్కసారి కూడా గుజరాత్‌ను ఓడించలేదు. ఈ నేపథ్యంలో రోహిత్ రాక జట్టుకు ఎంతో అవసరం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదే సమయంలో రోహిత్ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన క్వింటన్ డికాక్ అద్భుత శతకంతో ఫామ్‌లోకి వచ్చారు. ఒకవేళ రోహిత్ తుది జట్టులోకి వస్తే, విదేశీ ఆటగాళ్ల కోటాలో డికాక్ లేదా రికెల్టన్లలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది.
READ ALSO: CM Chandrababu: అర్థమైందా రాజా..? రజనీకాంత్ డైలాగ్ చంద్రబాబు నోట..
తాజావార్తలు
-
MI vs GT: రోహిత్ భాయ్ వస్తున్నాడు.. గుజరాత్ మ్యాచ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న హిట్‌మ్యాన్!
-
Dhurandhar 2: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్… అన్ స్టాపబుల్ బాక్సాఫీస్ ‘ధురంధర్’ రివెంజ్!
-
CM Chandrababu: అర్థమైందా రాజా..? రజనీకాంత్ డైలాగ్ చంద్రబాబు నోట..
-
Megastar Chiranjeevi: వారికి ‘మెగా’ భరోసా !
-
Hyundai Venue Knight Edition: హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ విడుదల.. ఫీచర్లు, ధర వివరాలివే
ట్రెండింగ్
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
-
స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!