IPL 2026: RCB అభిమానులకు గుడ్ న్యూస్.. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు అనుమతి!

  • IPL 2026 మ్యాచ్‌లను బెంగళూరులో నిర్వహించేందుకు అనుమతి
  • M. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
Kohli

Kohli

IPL 2026: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని M. చిన్నస్వామి స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026) సీజన్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. గత కొన్ని నెలలుగా ఈ వేదికపై మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అనే సందేహం నెలకొంది. దీనికి కారణం లేకపోలేదు. 2025 జూన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సంబరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత భద్రతా అంశాలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

Viral Video: ఛీ.. ఛీ.. ఇంత గలీజుగా ఉన్నారేంట్రా.. సె*క్స్ చేస్తావా అంటూ!

ఆ ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియాన్ని పెద్ద ఈవెంట్లకు అనుకూలం కాదని అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి ఈ వేదికపై ఒక్క పోటీ మ్యాచ్ కూడా నిర్వహించలేదు. ముఖ్యంగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ లో జరగాల్సిన కీలక మ్యాచ్‌ లను కూడా చివరి నిమిషంలో ఇతర వేదికలకు మార్చారు. వేదిక సంబంధించి సందేహాలు కొనసాగడంతో.. ఆర్సీబీ తాత్కాలిక హోం గ్రౌండ్ కోసం ఇతర ఎంపికలను పరిశీలించింది. ఆ సమయంలో డీవై పాటిల్ స్టేడియంను ప్రత్యామ్నాయంగా ఉపయోగించే అవకాశాలపై నివేదికలు వెలువడ్డాయి.

TG Municipal Elections Live Updates: నేడే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. మీ అభ్యర్థుల భవితవ్యం ఇక్కడ చూడండి..

అయితే చివరికి మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించాలా లేదా అనే తుది నిర్ణయం ఆర్సీబీ ఫ్రాంచైజీదే. ప్రస్తుత సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఆర్సీబీకి ఈసారి ఐపీఎల్ ఫైనల్‌ను నిర్వహించే హక్కు కూడా ఉండటం వల్ల ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గత సీజన్‌లో జరిగిన ఫైనల్‌లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత తొలి టైటిల్‌ను గెలుచుకుంది. అయితే ఆనందోత్సాహాల మధ్య జరిగిన తొక్కిసలాట ఘటన ఆ రోజు పెను విషాదంగా మారింది. ఇప్పుడీ అనుమతితో చిన్నస్వామి స్టేడియం మళ్లీ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది.