IPL 2026: గాయాల దెబ్బకు కొత్త ప్లేయర్లు, కొత్త ఆశలు.. KKR లోకి సైనీ, GT లోకి కేజ్రోలియా..!
- ఐపీఎల్ 2026కు ముందు జట్లలో కీలక మార్పులు
- గాయాల కారణంగా కొత్త ప్లేయర్ల ఎంపిక
- కేకేఆర్‌లోకి నవదీప్ సైనీ చేరిక
- జీటీ జట్టులోకి కుల్వంత్ కేజ్రోలియా చేరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఒకసారి టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు ముందు కీలక మార్పులు చేశాయి. గాయాల కారణంగా ఇద్దరు ఆటగాళ్ల స్థానంలో కొత్త ప్లేయర్లను ఎంపిక చేశాయి.
కుడిచేతి ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీను కేకేఆర్ జట్టు తీసుకుంది. గాయపడ్డ హర్షిత్ రాణా స్థానంలో సైనీ జట్టులో చేరనున్నాడు. అతనికి రూ.75 లక్షలు చెల్లించనున్నారు. ఇప్పటివరకు 32 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సైనీ 23 వికెట్లు సాధించగా, అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా భారత్ తరఫున 23 వికెట్లు తీసుకున్నాడు. హర్షిత్ రాణా ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ వార్మ్-అప్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఆడుతూ మోకాలి గాయానికి గురయ్యాడు. తర్వాత అతను శస్త్రచికిత్స చేయించుకొని ప్రస్తుతం రికవర్ అవుతున్నాడు. అతని రీ-ఎంట్రీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
Also Read
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
Central Cabinet: గుడ్ న్యూస్.. మరో 3 పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం..
మరోవైపు ఎడమచేతి పేసర్ కుల్వంత్ కేజ్రోలియాను గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు ఎంపిక చేసుకుంది. గాయపడ్డ పృథ్విరాజ్ యర్రా స్థానంలో అతను జట్టులోకి వచ్చాడు. కేజ్రోలియాకు రూ.30 లక్షలు చెల్లించనుంది జిటి. ఇప్పటివరకు అతను ఐపీఎల్‌లో 6 వికెట్లు సాధించాడు. గతంలో జీటీ, కేకేఆర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
కేకేఆర్ జట్టు (ఐపీఎల్ 2026):
అజింక్య రహానే (కెప్టెన్), అంగక్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కామెరూన్ గ్రీన్, ఫిన్ అలెన్, మతీషా పతిరణ, తేజస్వి సింగ్, కార్తిక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫర్ట్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రాచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్, బ్లెస్సింగ్ ముజారబాని.
CM Chandrababu: కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం.. ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ తో పర్యాటకశాఖ ఎంఓయూ..!
జీటీ జట్టు (ఐపీఎల్ 2026):
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కుమార్ కుశాగ్ర, అనుజ్ రావత్, జోస్ బట్లర్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, అర్షద్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాహుల్ తేవాటియా, కగిసో రబడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, గుర్నూర్ సింగ్ బ్రార్, రషీద్ ఖాన్, మనవ్ సుతార్, సాయి కిషోర్, జయంత్ యాదవ్, అశోక్ శర్మ, జేసన్ హోల్డర్, టామ్ బాంటన్, కుల్వంత్ కేజ్రోలియా, ల్యూక్ వుడ్.
తాజావార్తలు
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!