Central Cabinet: గుడ్ న్యూస్.. మరో 3 పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం..
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర క్యాబినెట్..
- మూడు పథకాలకు గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ విమానయాన రంగం , అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2027 మార్చి 25న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సుమారు రూ. 30,640 కోట్ల భారీ ప్యాకేజీతో మూడు ముఖ్యమైన పథకాలకు ఆమోదముద్ర వేశారు. దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే ఈ నిర్ణయాల్లో విమానయాన విస్తరణ, విదేశీయుల రాకపోకల పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలు ప్రధానంగా ఉన్నాయి.
ముఖ్యంగా సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేసే ‘ఉడాన్’ (UDAN) పథకంలో భారీ మార్పులు చేస్తూ.. దానిని పదేళ్ల పాటు పొడిగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ. 28,480 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో దేశవ్యాప్తంగా దాదాపు 100 విమానాశ్రయాలను ఆధునీకరించనున్నారు. ఫలితంగా టైర్-2, టైర్-3 నగరాల మధ్య విమాన రాకపోకలు మెరుగుపడటమే కాకుండా.. ప్రాంతీయ అనుసంధానత పెరిగి ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి.
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
Also Read:TGPSC: శుభవార్త చెప్పిన టీజీపీఎస్సీ(TGPSC).. ఏప్రిల్ 10 చివరి తేదీ..
మరోవైపు.. దేశంలోకి వచ్చే విదేశీయుల రాకపోకలను పర్యవేక్షించే ‘IVFRT’ (Immigration, Visa, Foreigners Registration Tracking) ప్రాజెక్టును మరో ఐదేళ్ల పాటు కొనసాగించనున్నారు. 2026 ఏప్రిల్ 1 నుంmr 2031 వరకు అమల్లో ఉండే ఈ పథకం కోసం రూ. 1800 కోట్లు కేటాయించారు. దీనివల్ల వీసా ప్రక్రియ వేగవంతం అవ్వడమే కాకుండా.. భద్రతా పరంగా విదేశీయుల ట్రాకింగ్ మరింత పటిష్టంగా మారుతుంది.
వీటితో పాటు.. పర్యావరణ పరిరక్షణపై భారత్ తన నిబద్ధతను చాటుకుంది. నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ (NDC) కింద 2025 నుంచి 2035 వరకు చేరుకోవాల్సిన పర్యావరణ లక్ష్యాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. కాలుష్య నివారణ, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ అడుగులు వేయనుంది. ఈ మూడు నిర్ణయాలు దేశాన్ని ఆధునిక , సుస్థిర అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!