CM Chandrababu: కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం.. ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ తో పర్యాటకశాఖ ఎంఓయూ..!
- ఏపీ పర్యాటక శాఖ – ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ మధ్య ఎంఓయూ
- సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
- ఆంధ్రప్రదేశ్ ను కలినరీ టూరిజం హబ్‌గా అభివృద్ధి లక్ష్యం
- తెలుగు వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం
- ప్రాంతీయ ఆహార సంస్కృతికి ప్రాధాన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ను కలినరీ టూరిజం హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పర్యాటక శాఖ తిరుపతిలోని ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ తో అవగాహనా ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ కీలకమైన ఎంఓయూ (MOU) కుదిరింది. ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు, ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ లు సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
Ragi cakes Recipe: జంక్ ఫుడ్‌కు బై బై… హెల్తీ ‘రాగి కేక్’ ట్రై చేయండి ఇంట్లోనే ఇలా..!
Also Read
తెలుగు రుచులను, వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు ప్రాంతీయ ఆహార సంస్కృతిని చాటి చెప్పేలా ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ సహకారం అందించనుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ను కలినరీ టూరిజానికి ఓ కీలకమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా ఈ ఎంఓయూ తోడ్పడనుంది. ప్రత్యేకించి కలినరీ విభాగంలో నైపుణ్యాభివృద్ధి కల్పన, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఏపీ టూరిజం అథారిటీ నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్స్, టూరిజం ఈవెంట్లను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెలుగు వంటకాల రుచులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలియచేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ఈ అవగాహనా ఒప్పందం కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!