IPL 2026: మైదానంలోనే కాదు.. భారీ పారితోషకాలు అందుకోవడంలోనూ స్టార్ల పోటీ.! టాప్ 5 హైయెస్ట్ పెయిడ్ స్టార్స్ వీరే..

Ipl 2026

Ipl 2026

IPL 2026: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య బెంగళూరులో జరిగే మ్యాచ్‌ తో టోర్నీకి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో అత్యధిక జీతాలు అందుకుంటున్న టాప్-5 జీతగాళ్లు ఎవరో చూద్దామా..

రిషబ్ పంత్ (LSG):
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషభ్ పంత్‌ ను IPL 2025 ముందు రూ. 27 కోట్లకు కొనుగోలు చేశారు. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 269 పరుగులు చేసి, RCBపై శతకం నమోదు చేశాడు. ఈ ఏడాది కూడా అదే జట్టుకు నాయకత్వం వహిస్తూ అత్యధిక జీతం అందుకోనున్నాడు.

Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!

శ్రేయస్ అయ్యర్ (PBKS):
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ ను రూ. 26.75 కోట్లకు కొనుగోలు అయ్యాడు. గత సీజన్‌లో 17 ఇన్నింగ్స్‌ లలో 604 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కి తీసుకెళ్లాడు. ఈసారి కూడా అతడి నుండి భారీ ప్రదర్శన ఆశిస్తున్నారు.

కామెరాన్ గ్రీన్ (KKR):
కోల్కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ కెమెరాన్ గ్రీన్‌ ను IPL 2026 మినీ వేలంలో రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే బీసీసీఐ ‘మ్యాక్సిమమ్ ఫీ రూల్’ కారణంగా అతను రూ. 18 కోట్ల వరకు మాత్రమే ఆడనున్నాడు.

హేన్రిచ్ క్లాసెన్ (SRH):
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ క్లాసెన్ ఈ సీజన్‌లో రూ. 23 కోట్ల జీతం అందుకోనున్నాడు. గత రెండు సీజన్‌ల్లో వరుసగా మంచి ప్రదర్శన చేస్తూ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు.

MP Kavya: గడ్డి మందుపై నిషేధం విధించాలి.. లోక్‌సభలో ఎంపీ కావ్య డిమాండ్..

విరాట్ కోహ్లీ (RCB):
టీమిండియా లెజండరీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో రూ. 21 కోట్ల జీతం అందుకోనున్నాడు. RCB తరఫున అన్ని సీజన్‌ల్లో ఆడిన కోహ్లీ.. గత ఏడాది జట్టుకు తొలి టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.