MI vs RCB: ఉత్కంఠ పోరులో బెంగళూరు విజయం.. ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం!
- ఉత్కంఠ పోరులో ముంబైపై బెంగళూరు విజయం
- చెలరేగిన విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్
- తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాల మెరుపులు వృదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం ముంబై ఇండియన్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 222 పరుగుల భారీ ఛేదనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసి ఓడింది. తిలక్ వర్మ (56; 29 బంతుల్లో 4×4, 4×6), హార్దిక్ పాండ్యా (42; 15 బంతుల్లో 3×4, 4×6) ముంబైని గెలిపించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా (4/45), జోష్ హేజిల్‌వుడ్ (2/37), యశ్ దయాళ్ (2/46) రాణించారు. ముంబై ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో నాలుగో ఓడిపోయి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (4) వికెట్ కోల్పోయినా.. విరాట్ కోహ్లీ (67; 42 బంతుల్లో 8×4 2×6) చెలరేగాడు. దేవదత్ పడిక్కల్ (37)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పడిక్కల్ కూడా ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. ఆపై రజత్ పాటీదార్ (64; 32 బంతుల్లో 5×4, 4×6), జితేశ్ శర్మ (40 నాటౌట్; 19 బంతుల్లో 2×4, 4×6)లు రెచ్చిపోవడంతో ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. బుమ్రా పొదుపుగా బౌలింగ్ (0/29) చేశాడు కానీ.. వికెట్ మాత్రం తీయలేకపోయాడు. బౌల్ట్ ఏకంగా 57 రన్స్ ఇవ్వడం విశేషం.
Also Read
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
భారీ ఛేదనలో ముంబైకి శుభారంభం దక్కలేదు. రోహిత్ శర్మ (17), రికిల్టన్ (17), విల్ జాక్స్ (22), సూర్యకుమార్ యాదవ్ (28) ధాటిగానే ఆరంభించినా పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. 12 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులే చేసిన ముంబై ఓటమి బాటలో సాగింది. ఈ సమయంలో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలు జట్టును గెలిపించడానికి బాగానే ప్రయత్నించారు. చివరి 3 ఓవర్లలో 41 పరుగులు చేయాల్సి రాగా.. ముంబై గెలుస్తుందనుకున్నారు. తిలక్‌ను భువనేశ్వర్ అవుట్ చేసి 13 పరుగులే ఇచ్చాడు. 19వ ఓవర్ తొలి బంతికే హార్దిక్‌ను హేజిల్‌వుడ్ ఔట్ చేశాడు. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా.. కృనాల్ 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!