IPL 2025 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు మొదటిసారి ట్రోఫీ గెలిచేందుకు తలపడుతున్నాయి. ఇప్పటి వరకు టైటిల్ అందుకోని ఈ రెండు జట్లు ఈసారి తమ మొదటి ట్రోఫీ కోసం పోటీపడుతున్నాయి. కానీ, వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందా అనే అనుమానం రెండు జట్లను మాత్రమే కాకుండా అభిమానులను కూడా కలవరపెడుతోంది.
Read Also: IPL 2025 Winner: అందరి అంచనాలు ఆ టీం వైపే.. చివరికి AI కూడా..!
నేడు (జూన్ 3) నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్‌కి వాతావరణం అనుకూలంగా లేదనే చెప్పవచ్చు. ఇప్పటికే అహ్మదాబాద్ లో జరిగిన క్వాలిఫయర్ 2 వర్షం వల్ల కాస్త ప్రభావితమైంది. ఇక ఫైనల్‌కి కూడా కొద్దిపాటి వర్ష సూచనలు ఉన్నాయి. సాయంత్రం సమయంలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నా, అది పెరిగి భారీ వర్షంగా మారే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థులను ఊహించి బీసీసీఐ ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2, ఎలిమినేటర్ మ్యాచ్ లకు రిజర్వ్ డే లేకపోయినా, ఫైనల్ కు మాత్రం రిజర్వ్ డేని ఏర్పాటు చేసింది. అంటే, ఒకవేళ ఏదైనా కారణం చేత మంగళవారం మ్యాచ్ పూర్తి చేయలేకపోతే.. మ్యాచ్ బుధవారం (మే 04) కొనసాగించబడుతుంది.
విషయం ఇక్కడే ఆసక్తికరంగా మారుతుంది. ఒకవేళ రిజర్వ్ డే కూడా వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే పరిస్థితి ఏంటని చాలామందికి అనుమానం ఉంది. ఒకవేళ ఇదే జరుగుతే లీగ్ దశలో ఎవరైతే ఎక్కువ పాయింట్లతో ముందున్నారో వారు ఛాంపియన్‌గా ప్రకటించబడతారు. ఈ విషయంలో పంజాబ్ కింగ్స్ పైచేయిగా ఉంది. అంటే, రిజర్వ్ డే కూడా రద్దయితే పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలుచుకుంటుంది.
Read Also: IPL 2025 Final: సాయంత్రం 6 గంటలకే ఐపీఎల్ ముగింపు వేడుకలు..
ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. RCB ఇప్పటికే మూడుసార్లు (2009, 2011, 2016) ఫైనల్‌కి వెళ్లినా టైటిల్‌ను అందుకోలేకపోయింది. పంజాబ్ కింగ్స్ 2014లో ఫైనల్‌కి వెళ్లి కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. అంటే ఈసారి ఐపీఎల్‌కు కొత్త ఛాంపియన్ రావడం ఖాయం. ఇక ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 36 సార్లు తలపడగా, 18 గెలుపులతో సమంగా నిలిచాయి. ఏది ఏమైనా ఈ ఏడాది ఓ కొత్త ఛాంపియన్ జట్టు తెరమీదకు రానుంది.