నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ పై విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ పై విజయం తర్వాత CSK 8 పాయింట్లతో తమ లీగ్ ను ముగించింది. ఈ విజయంతో చెన్నైకి పెద్దగా ఒరిగేదేమి లేనప్పటికీ గుజరాత్ భారీ నష్టాన్ని చవిచూసింది. టాప్-2 కి చేరుకోవాలనుకున్న తమ ఆశలకు గండి పడింది. ఈ మ్యాచ్‌లో చెన్నైపై విజయం సాధించి ఉంటే గుజరాత్ 20 పాయింట్లతో ముందంజలో ఉండేది. అప్పుడు మిగిలిన జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా అగ్రస్థానానికి చేరుకునేది. కానీ గుజరాత్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవడంతో మిగిలిన జట్ల ఫలితాల పై ఆధారపడాల్సి వచ్చింది.
గుజరాత్ ఓటమితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాభపడింది. ఆర్సీబీ టాప్-2కి చేరుకోవడానికి మార్గం సులువైంది. ఆర్సీబీకి ఇంకా ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించాలి. అప్పుడు ఆర్సీబీ ఖాతాలో 19 పాయింట్లు ఉంటాయి. దీంతో గుజరాత్ టాప్2 అవకాశాన్ని కోల్పోతుంది. కాగా ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్ ని రేపు 27న లక్నోలో ఆడనుంది. ఇదిలా ఉంటె ఈ రోజు ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్ -2లోకి దూసుకెళ్తుంది. 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ గెలిస్తే టాప్-2లో స్థానాన్ని ఖరారు చేసుకుంటుంది.
ముంబై గెలిస్తే 18 పాయింట్లతో గుజరాత్ తో సమానంగా నిలుస్తుంది. అయితే ఇక్కడ రన్ రేట్ కీలకంగా మారింది. ముంబైకి రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు టాప్-2 ప్లేస్ ను ఖాయం చేసుకుంటుంది. ఇప్ పోజిబుల్ వర్షంతో మ్యాచ్ జరగకపోతే అప్పుడు పంజాబ్ కింగ్స్ , గుజరాత్ కంటే మెరుగైన రన్ రేట్ కలిగి ఉండటంతో 18 పాయింట్లతో టాప్ -2కి చేరుతుంది. ఏదేమైనా గుజరాత్ టాప్ 2 ప్లేస్ ఖాయం చేసుకోవాలంటే లక్నోపై ఆర్సీబీ ఓడిపోవాలని కోరుకోవాలి.