NTV Telugu Site icon

IPL 2025 Mega Auction: నెస్ వాడియాతో షారుఖ్‌ ఖాన్ వాగ్వాదం.. కావ్య మారన్ మద్దతు!

Shah Rukh Khan Vs Ness Wadia

Shah Rukh Khan Vs Ness Wadia

Kavya Maran Suppots Shah Rukh Khan in IPL 2025 Auction Meeting: 2025 మెగా వేలంకు సంబంధించి ఐపీఎల్‌ పాలక మండలి, పది ఫ్రాంచైజీల యజమానుల మధ్య ముంబైలో సమావేశం జరిగింది. బుధవారం రాత్రి వరకూ జరిగిన ఈ భేటీలో మెగా వేలం నిర్వహణ, రిటెన్షన్‌ పాలసీ, ఇంపాక్ట్‌ రూల్‌పై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఐపీఎల్‌ పాలక మండలి, ఫ్రాంచైజీల యజమానుల మధ్య వాడివేడిగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. బీసీసీఐ మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుండానే ఈ భేటీని ముగించింది. మరోసారి భేటీ జరిగే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

అయితే ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వహణకు చాలా ఫ్రాంచైజీలు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సహా యజమాని షారుఖ్‌ ఖాన్ మెగా వేలంను వ్యతిరేకించినట్లు ఐపీఎల్ వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. షారుఖ్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ సీఈఓ కావ్య మారన్ మద్దతు పలికినట్లు సమాచారం. ఈ క్రమంలో పంజాబ్‌ కింగ్స్‌ సహా యజమాని నెస్‌ వాడియా, షారుఖ్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందట. షారుఖ్ ఎక్కువ మందిని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతుండగా.. నెస్‌ మాత్రం అవసరం లేదని వాదించినట్లు సమాచారం. తప్పనిసరిగా మెగా వేలం నిర్వహించాలని పంజాబ్‌ ఓనర్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: SC/ST Sub-Classification: ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004లోనే చెప్పా: మంద కృష్ణ మాదిగ

కనీసం 8 మందిని (నలుగు ప్లేయర్లను రిటైన్ చేసుకోవడం లేదా ఇద్దరు ఆటగాళ్లను ఆర్‌టీఎమ్ ద్వారా) రిటైన్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించాలని ఎస్‌ఆర్‌హెచ్‌ సీఈఓ కావ్య మారన్ కోరినట్లు తెలుస్తోంది. విదేశీ ప్లేయర్లలో అదనంగా మరికొందరిని అట్టిపెట్టుకొనే అవకాశం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారట. గాయంతో కాకుండా ఇతర కారణాలతో వైదొలిగే విదేశీ ఆటగాళ్లను టోర్నీ నుంచి నిషేధించాలిని బీసీసీఐకి కావ్య చెప్పారట. ఈ సమావేశంకు షారుఖ్‌ ఖాన్ (కోల్‌కతా), కిరణ్‌ కుమార్‌ గ్రంథి (ఢిల్లీ), సంజీవ్ గోయెంకా (లక్నో), నెస్‌ వాడియా (పంజాబ్), రూపా గురునాథ్‌ (చెన్నై), కావ్యా మారన్ (హైదరాబాద్), మనోజ్‌ బదాలే (రాజస్థాన్‌) తదితరులు హాజరయ్యారు.