NTV Telugu Site icon

IPL 2024: ఐపీఎల్‌ ఎక్కడికీ పోదు.. పూర్తిగా భారత్‌లోనే!

Ipl 2024

Ipl 2024

Entire IPL 2024 will happen in India Said Jay Shah: దేశంలో లోక్‌సభ ఎన్నికల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సెకెండ్‌ ఫేజ్‌ను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలకు పులిస్టాప్ పడింది. దేశవాప్తంగా ఎన్నికలు జరగనున్నప్పటికీ.. ఐపీఎల్‌ 17వ సీజన్ ఎక్కడికీ తరలిపోదని, పూర్తిగా భారత్‌లోనే జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. శనివారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో జై షా స్పందించారు.

‘ఐపీఎల్‌ 2924 ఎక్కడికీ తరలిపోదు. విదేశాల్లో నిర్వహించే ఆలోచన లేదు. టోర్నీ పూర్తిగా భారత్‌లోనే జరుగుతుంది. మిగతా ఐపీఎల్‌ షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తాం’ అని జై షా చెప్పారు. మార్చి 22న ఐపీఎల్‌ 2024 ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి దశలో 21 మ్యాచ్‌లకు బీసీసీఐ షెడ్యూల్‌ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లను షెడ్యూల్‌ చేసిన అనంతరం బీసీసీఐ విడుదల చేయనుంది.

Also Read: WPL 2024 Final: నేడే డబ్ల్యూపీఎల్‌ 2024 ఫైనల్‌.. కొత్త విజేత ఎవరో!

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ షెడ్యూల్‌ బట్టి బీసీసీఐ ఐపీఎల్ 2024 షెడ్యూల్‌ను ప్రకటించనుంది. మరో వారంలో పూర్తి షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Show comments