Rishabh Pant: ప్రతి మ్యాచ్ ఆడతానని, వికెట్ కీపింగ్ చేస్తానని పంత్ చెబుతాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Coach Ricky Ponting React on Rishabh Pant Play in Ipl 2024: 2022 డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తొలుత నడవడానికే కష్టపడిన పంత్ శస్త్రచికిత్సల అనంతరం కోలుకున్నాడు. ప్రస్తుతం గాయాల నుంచి కోలుకున్న పంత్.. క్రికెట్ సాధన చేస్తున్నాడు. ఇటీవల బెంగళూరులోని ఎన్సీఏలో త్రో స్పెషలిస్టులతో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ 2024తో పునరాగమనం చేయాలని పంత్ చూస్తున్నాడు. అయితే పంత్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటాడని తాము నమ్ముతున్నామని, కీపింగ్ బాధ్యతలు మాత్రం అప్పగించే విషయంపై ఇక స్పష్టత లేదన్నాడు.
తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న రికీ పాంటింగ్.. రిషబ్ పంత్ గురించి స్పందించాడు. ‘ఐపీఎల్ 2024లో ఆడతాననే నమ్మకంతో పంత్ ఉన్నాడు. అయితే ఎంత సామర్థ్యంతో ఆడుతాడనేది చెప్పలేం. సోషల్ మీడియాలో పంత్ వీడియోలు అందరూ చూసి ఉంటారు. పంత్ ఇప్పుడు బాగానే ఉన్నాడు. అయితే తొలి మ్యాచ్ మరో ఆరు వారాల్లో ఉంది. కాబట్టి అతడు వికెట్ కీపింగ్ చేస్తాడని ఖచ్చితంగా చెప్పలేం. కీపింగ్ గురించి అతడిని నేను అడిగితే. ప్రతి మ్యాచ్ ఆడతానని, వికెట్ కీపింగ్ చేస్తానని, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని పంత్ చెబుతాడు’ అని పాంటింగ్ తెలిపాడు.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
Also Read: Uday Saharan: క్రీజ్‌లో నేనూ ఉంటా, నువ్వూ ఉండు అని సచిన్‌తో చెప్పా: అండర్ 19 కెప్టెన్
‘రిషబ్ పంత్ డైనమిక్ ఆటగాడు. అతను మా కెప్టెన్. గత సంవత్సరం మేము అతనిని చాలా మిస్ అయ్యాం. గత 12-13 నెలలు అతడి ప్రయాణం చాలా కష్టంగా సాగింది. కారు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాడు. మళ్లీ క్రికెట్ ఆడే అవకాశం అతడికి దక్కింది. ఐపీఎల్ 2024 ఆడుతాడని మేం నమ్మకంగా ఉన్నాం. అయితే 14 మ్యాచ్‌లు ఆడకపోయినా.. 10 మ్యాచ్‌లు ఆడినా చాలు మాకు డి బోనస్’ అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. గత సీజన్‌కు పంత్ దూరమవ్వడంతో.. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!