Rishabh Pant Becomes 1st Captain being part of IPL Auction 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో మాములుగా అయితే ఫ్రాంజైజీ యజమానులు, మెంటార్‌లు, కోచ్‌లు పాల్గొంటారు. అయితే ఈసారి వేలంలో ఓ కెప్టెన్ భాగం అవుతున్నాడు. అతడే టీమిండియా యువ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్. ఐపీఎల్ 2024 కోసం మరికొద్దిసేపట్లో దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో ప్రారంభం కానున్న వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో కెప్టెన్ పంత్ కూడా భాగమవుతున్నాడు. దాంతో ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే వేలంలో పాల్గొన్న తొలి కెప్టెన్‌గా పంత్ రికార్డు నెలకొల్పనున్నాడు.
ఐపీఎల్ 2024 వేలం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఇప్పటికే దుబాయ్ చేరుకున్నాడు. వేలంలో ఎవరిని కొనాలి?, ఏ ఆటగాడికి ఎంత ధర పెట్టొచ్చు? వంటి విషయాలను కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి పంత్ చూసుకోనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పోస్ట్ చేసిన వీడియోలో పంత్ మాట్లాడాడుతూ… ‘ఐపీఎల్ వేలంలో పాల్గొనడం కొత్తగా ఉంది. నేను ఇంతకు ముందు వేలం ప్రక్రియలో భాగం కాలేదు. నేను ఇప్పుడు వేలం కోసం ఎదురు చూస్తున్నాను’ అని అన్నాడు.
Also Read: 300 Stones In Kidney: నీటికి బదులు బబుల్ టీ.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు!
గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్.. దాదాపు ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు కోలుకున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా 2023 ఐపీఎల్‌తో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్‌నకు పంత్ దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం కోలుకున్న తాడు తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే సిరీస్ కోసం జట్టులోకి తిరిగి వస్తాడని ఈ నివేదికలు చెబుతున్నాయి.