IPL 2023 : టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల విజయ లక్ష్యంతో చెన్నై జట్టు బరిలోకి దిగింది. సందీప్ శర్మ వేసిన తొలి ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ ఫోర్ కొట్టడంతో మొదటి ఓవర్లో చెన్నై జట్టు 7పరుగులు సాధించింది. 10 పరుగుల వద్ద చెన్నై మొదటి వికెట్ కోల్పోయింది. సందీప్ శర్మ బౌలింగ్‌లోనే యశస్వి జైశ్వాల్ కు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ గైక్వాడ్ పెవిలియన్ చేరుకున్నారు. అనంతరం అజింక్యా రహానే క్రీజులోకి వచ్చాడు. జాసన్ హోల్డర్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు వచ్చాయి. నాలుగో బంతిని అజింక్యా రహానే, ఆఖరి బంతికి డెవాన్ కాన్వే బౌండరీ బాదారు. మొత్తంగా నాలుగో ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
Read Also: IPL 2023 : బట్లర్ హాఫ్ సెంచరీ.. చెన్నై టార్గెట్176 పరుగులు
తొలి మూడు ఓవర్లు ఆచితూచి ఆడిన కాన్వే క్రమంగా స్పీడు పెంచాడు. ఆడమ్ జాంపా వేసిన ఐదో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు చెన్నై స్కోరు 35/1 డెవాన్ కాన్వే 16, అజింక్యా రహానే 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. వన్‌డౌన్‌లో వచ్చిన అజింక్యా రహానే వేగంగా ఆడుతూ… అశ్విన్ వేసిన ఆరో ఓవర్లోని మూడో బంతికి సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే (6 ఓవర్లు) పూర్తి అయ్యే సరికి చెన్నై స్కోరు 45/1 డెవాన్ కాన్వే 17, అజింక్యా రహానే 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. జాసన్ హోల్డర్ వేసిన ఎనిమిదవ ఓవర్లో డెవాన్ కాన్వే ఓ బౌండరీ కొట్టడంతో మొత్తం 9 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లకు చెన్నై స్కోరు 61/1 డెవాన్ కాన్వే 30, అజింక్యా రహానే 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.