ఐఫోన్.. ఈ పేరుకే యమా క్రేజ్ ఉంటుంది. ఇక దీని నుంచి కొత్త సిరీస్ ఫోన్ వస్తుంది అంటే క్యూలు కట్టి మరీ జనాలు ఎగబడి కొనేస్తారు. తాజాగా ఐఫోన్ 15 విడుదలైన సంగతి తెలిసిందే. దీని కోసం గంటలు తరబడి ఎదురు చూసి మరీ చాలా మంది కొన్నారు. అయితే దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఛార్జింగ్ విషయానికి సంబంధించి ఎక్కువగా ఈ కంప్లైట్స్ వస్తున్నాయి. ఎంతో అశపడి కొనుక్కున్న ఫోన్ ఛార్జింగ్ పెట్టగానే వెడెక్కిపోతుందని చాలా మంది సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అంతేకాదు కొద్దిసేపు గేమ్ ఆడినా కూడా ఫోన్ విపరీతంగా వేడెక్కిపోతుందని దానిని ముట్టుకోలేకపోతున్నామని తాజాగా ఫోన్ కొన్న వినియోగదారులు అల్లాడిపోతున్నారు.
Also Read: Cement Price Hike: సామాన్యుల సొంతింటి కల ఖరీదు కావొచ్చు… భారీగా పెరగనున్న సిమెంట్ ధర
ఈ విషయంపై యాపిల్ కంపెనీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో యాపిల్ టెక్నికల్ సపోర్ట్ టీమ్ స్పందించింది. ఇలాంటి సమస్య ఎదురైనపుడు ఏంచేయాలనే విషయంపై గతంలో కంపెనీ ప్రచురించిన ఓ ఆర్టికల్ ను రిఫర్ చేస్తూ అందులోని సూచనలు ఫాలో కావాలంటూ ఆ టీం సూచించింది. ఈ ఆర్టికల్ లో ఐఫోన్ వేడెక్కడానికి గల పలు కారణాలను కంపెనీ పేర్కొంది. ఛార్జింగ్ పెట్టినపుడు, ఫస్ట్ టైం సెట్టింగ్ చేస్తున్నపుడు, ఇంటెన్సివ్ యాప్ లను వాడుతున్నపుడు ఫోన్ లలో ఈ సమస్య ఏర్పడుతుందని పేర్కొంది. ఐఫోన్ కొత్త సిరీస్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది యాపిల్ కంపెనీ.
అన్ని రకాల పరీక్షలు జరిపాకే మార్కెట్లోకి కొత్త సిరీస్ లను విడుదల చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జనాల్లో ఐఫోన్ కు క్రేజ్ ఉండటం వల్ల వీటిని కంపెనీ పెద్ద మొత్తంలో తయారు చేస్తోందని, దాని కంటే ముందు ఫోన్ ను అన్ని రకాలుగా పరీక్షిస్తుందని వివరిస్తున్నారు మార్కెట్ నిపుణులు. యాపిల్ కంపెనీ ఏటా ఆర్జించే ఆదాయంలో సగం వాటా ఐఫోన్లదే అంటా. అందుకే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహిరిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందంట. కాబట్టి ఇలా వేడెక్కినంత మాత్రాన ఫోన్ పాడైపోయిందని ఆందోళన చెందాల్సిన పనిలేదని కంపెనీ సూచిస్తుంది.