NTV Telugu Site icon

iPhone 15 Price: భారత్‌లో కంటే తక్కువ ధరకే ఐఫోన్‌ 15 ఫోన్స్.. ఏకంగా 50 శాతం! ఎక్కడో తెలుసా?

Iphone 15 Series Price

Iphone 15 Series Price

Compare iPhone 15 Price in US and Dubai vs India: ‘యాపిల్‌’ లవర్స్‌ ఎంతగానో ఎదురుచూసిన ఐఫోన్‌ 15 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన విషయం తెలిసిందే. 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌లను యాపిల్‌ రిలీజ్ చేసింది. 15 సిరీస్‌ ప్రీ బుకింగ్స్ నేడు ఆరంభం కానుండగా.. విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే ప్రస్తుతం ఐఫోన్‌ 15 సిరీస్ ధరల గురించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అమెరికా, దుబాయ్‌తో పోలిస్తే భారత్‌లోనే ఐఫోన్‌ 15 సిరీస్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. భారత దేశంలో తయారయ్యే ఐఫోన్ల ధరలు ఆయా దేశాలతో పోల్చినప్పుడు.. మన దగ్గరే అధికంగా ఉండడం విశేషం. ఐఫోన్‌ 15 మోడల్‌ ఆరంభ ధర అమెరికాలో 799 డాలర్లు. అదే భారత్‌లో రూ. 79,900గా ఉంది. 799 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం.. రూ. 66,353 వేలు అవుతుంది. అయితే ఈ మోడల్ ధర దాదాపు 20 శాతం అధికంగా ఉండడం గమనార్హం. అరబ్‌ ఎమిరేట్స్‌లో దీని ధర 3,399 కాగా.. భారత కరెన్సీ (22 రూపాయలు = 1 దిర్హమ్‌) ప్రకారం రూ. 76 వేలు అవుతుంది. దుబాయ్‌తో పోల్చినా భారత్‌లోనే ధర ఎక్కువ.

Also Read: World Cup 2023: పాకిస్తాన్‌కు భారీ షాక్‌.. ప్రపంచకప్‌ 2023కి స్టార్ పేసర్ దూరం!

ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ బేస్‌ మోడల్‌ ధర అమెరికాలో 1,199 డాలర్లుగా ఉంది. దీన్ని భారత కరెన్సీలోకి కన్వర్ట్‌ చేస్తే.. రూ. 99 వేలు అవుతుంది. అయితే భారత్‌లో ప్రో మ్యాక్స్‌ బేస్‌ మోడల్‌ ధర రూ. 1.59 లక్షలుగా ఉంది. అంటే దాదాపు 50 శాతం అధికం. దుబాయ్‌లో ఈ మోడల్‌ ధర 5,099 దిర్హమ్‌లు. దిర్హమ్‌లను భారత కరెన్సీలోకి మారిస్తే 1.15 లక్షలు. ఐఫోన్‌ 15 ప్లస్‌ మోడల్‌దీ అదే పరిస్థితి. ఐఫోన్‌ 15 సిరీస్ ఫోన్స్ కొనాలనుకునే వారు.. అవకాశం ఉంటే యూఎస్ లేదా దుబాయ్‌లో కొనేసుకుంటే బెటర్. థాయ్‌లాండ్, చైనాలో కూడా ధరలు తక్కువే ఉన్నాయి.

Show comments