iPhone 15 Sale in India: యాపిల్ ‘ఐఫోన్ 15’ సిరీస్ సేల్స్ మొదలు.. డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 15 Series Launch and Discount Offers: సెప్టెంబర్ 12న జరిగిన వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను యాపిల్ కంపెనీ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ప్రీ-బుకింగ్‌లు సెప్టెంబర్ 15న ఆరంభం కాగా.. ఈరోజు నుంచి భారత్‌లో అమ్మకాలు మొదలయ్యాయి. యాపిల్ అధికారిక స్టోర్స్, ఈ కామర్స్ వెబ్‌సైట్‌ల నుంచి 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా నేటి నుంచి ఈ ఫోన్ విక్రయించబడుతోంది.
iPhone 15 and iPhone 15 Plus Price in Inaia:
ఐఫోన్ 15 సిరీస్‌లో చౌకైన ఫోన్ ఐఫోన్ 15. ఈ స్మార్ట్‌ఫోన్ (128GB వేరియెంట్) ధర భారతదేశంలో రూ. 79,900గా ఉంది. 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 89,900 కాగా.. 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,09,900గా ఉంది. ఐఫోన్ 15 ప్లస్128GB వేరియంట్ ధర రూ. 89,900 కాగా.. 256GB వేరియంట్ ధర రూ. 99,900గా ఉంది. ఇక 512GB వేరియంట్ ధర రూ. 1,19,900లకు భారతదేశంలో అందుబాటులో ఉంది.
Also Read
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
iPhone 15 Pro and iPhone 15 Pro Max Price in India:
ఐఫోన్ 15 ప్రో 128GB స్టోరేజ్ వేరియంట్ ధర భారతదేశంలో రూ. 1,34,900గా ఉండగా.. 256GB వేరియంట్ ధర రూ. 1,44,900గా ఉంది. ఇక ఐఫోన్ 15 ప్రో 512GB వేరియంట్ ధర రూ. 1,64,900 కాగా.. 1TB వేరియంట్ ధర రూ. 1,84,900గా ఉంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 256GB వేరియంట్ ధర రూ. 1,59,900 కాగా.. 512GB వేరియంట్ ధర రూ. 1,79,900గా ఉంది. ఇక 1TB వేరియంట్ ధర రూ. 1,99,900లకు అందుబాటులో ఉంది.
iPhone 15 Launch Offers:
ఐఫోన్ 15 సిరీస్ కొనుగోళ్లపై అద్భుతమైన తగ్గింపు, లాంచ్ ఆఫర్‌లు ఉన్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా యాపిల్ నుంచి ఈఎంఐ ఎంపికతో కొనుగోలు చేస్తే రూ. 5000 తగ్గింపు పొందవచ్చు. మరోవైపు ఐఫోన్ 15 ప్రో లేదా ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే.. రూ. 6,000 తగ్గింపును పొందుతారు. వీటిపై మూడు లేదా ఆరు నెలల నో-కాస్ట్ ఈఎంఐని కూడా పొందవచ్చు. మరిన్ని ఆఫర్స్ కూడా ఈ కామర్స్ వెబ్‌సైట్‌లలో ఉన్నాయి.
తాజావార్తలు
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
-
Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: ‘ప్యారడైజ్’ ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!