iPhone 15 Series Sale: భారత్‌లో ఐఫోన్ 15 సిరీస్ సేల్స్ స్టార్ట్.. యాపిల్ స్టోర్స్ ముందు భారీ క్యూలు! విమానంలో వచ్చి మరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Man waited in line in front of Apple Store for 18 hours for iPhone 15: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’ సెప్టెంబర్ 12న వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లను యాపిల్ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ప్రీ-బుకింగ్‌లు సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యాయి. యాపిల్ అధికారిక స్టోర్స్, యాపిల్ వెబ్‌సైట్ నుంచి 15 సిరీస్ లైనప్‌ను కొనుగోలు చేయవచ్చు. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ విక్రయాలు ఈరోజు నుంచి భారత్‌లో ప్రారంభమయ్యాయి.
భారతదేశంలో 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను యాపిల్ అధికారిక వెబ్‌సైట్ సహా ఈ-కామర్స్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ఫోన్‌ను బుక్ చేసుకున్న వారు డెలివరీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 15 సిరీస్ కొనాలనుకునేవారు యాపిల్ స్టోర్స్ ముందు వేచి ఉన్నారు. కొన్నిచోట్ల భారీ క్యూలు కూడా ఉన్నాయి. ముంబైలోని యాపిల్ స్టోర్ బయట జనాలు పెద్ద క్యూలో నిలబడి ఉన్నారు. కొందరు 17 గంటలుగా క్యూలో నిలబడి ఉన్నారట. మరికొందరు ఐఫోన్ 15 కొనేందుకు పలు ప్రాంతాల నుంచి విమానంలో ముంబై చేరుకున్నారట.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
Also Read: Mohali Pitch Report: భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే.. బ్యాటర్లకు పండగే! లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్
భారతదేశంలో మొదటి ఐఫోన్ 15 కొనాలని ఓ వ్యక్తి ముంబై బీకేసీలోని యాపిల్ స్టోర్ వద్ద గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచే క్యూలో ఉన్నాడట. అతడు ఇప్పటివరకు 18 గంటలపాటు క్యూలో వేచి ఉన్నాడు. ఐఫోన్ 15 కొనడానికి అహ్మదాబాద్ నుండి ముంబై వచ్చాడట. బెంగుళూరుకు చెందిన మరో వ్యక్తి కూడా ఐఫోన్ 15 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడట. ఇదంతా చూస్తే భారతదేశంలో ఐఫోన్ 15 సిరీస్‌కు ఎంత క్రేజ్ ఉందో యిట్టె తెలిసిపోతుంది.
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!