iPhone 14 Price Drop in Amazon: ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ‘గ్రేట్ సమ్మర్ సేల్’ 2024 నడుస్తోంది. మే 2న ఆరంభం అయిన ఈ సేల్.. ఆరు రోజుల పాటు మే 7 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్‌లపై భారీ తగ్గింపు ఉంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గవచ్చు కూడా. ఐఫోన్ 14పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
యాపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14 128 GB) అసలు ధర రూ. 79,900గా ఉంది. ‘గ్రేట్ సమ్మర్ సేల్’ 2024లో భాగంగా అమెజాన్ 26 శాతం తగ్గింపు ఆఫర్ ఇస్తోంది. తగ్గింపు తర్వాత ఐఫోన్ 14ను మీరు రూ. 58,999కు సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు కొన్ని క్యాష్‌బ్యాక్, బ్యాంక్ ఆఫర్‌లను కూడా మీరు పొందవచ్చు. దాంతో ఐఫోన్ 14ను మరింత తక్కువకు కొనుగోలు చేయొచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 13ను ఎక్స్‌ఛేంజ్ ద్వారా ఐఫోన్ 14 ధర భారీగా తగ్గుతుంది.
Also Read: Rohit Sharma: ప్రపంచకప్ జట్టు నుంచి రోహిత్ శర్మను తొలగించాలి.. భారత మాజీ ప్లేయర్ ట్వీట్!
యాపిల్ ఐఫోన్ 15 (Apple iPhone 15 128 GB)ధర రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది. అమెజాన్‌లో ప్రస్తుతం 12 శాతం తగ్గింపు తర్వాత ఐఫోన్ 15 ధర రూ.70,500గా ఉంది. బ్యాంక్ ఆఫర్‌లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. దాంతో ఐఫోన్ 15 ధర మరింత తగ్గనుంది. ఐఫోన్ 15 లైనప్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఉన్నాయి.