ప్రభుత్వ రంగ సంస్థల్లో అతి పెద్ద రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 490 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో అప్రంటీస్, అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అప్రెంటీస్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలో ఖాళీలు ఉన్నాయి..
ఖాళీల వివరాలు..
1. ట్రేడ్ అప్రెంటీస్ 150
2. టెక్నీషియన్ అప్రెంటీస్ 110
3. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ 230
మొత్తం: 490
అర్హతలు..
ట్రేడ్ అప్రెంటీస్- 10వ తరగతి
టెక్నీషియన్ అప్రెంటీస్ – డిప్లొమా
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ – డిగ్రీ, BBA, BA, B.Com, B.Sc..
వయస్సు..
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 31, 2023 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు, అలాగే గరిష్టంగా 24 సంవత్సరాలు మించకూడదు..
దరఖాస్తులకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..
దరఖాస్తు ప్రారంభ తేదీ: 25/08/2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 10, 2023
ఎలా అప్లై చేసుకోవాలంటే?
*. ట్రేడ్ అప్రంటీస్ (Trade Apprentice) – ఐటీఐ http://apprenticeshipindia.org/candidate-registration
*.టెక్నీషియన్ అప్రంటీస్ (Technician Apprentice) *.డిప్లొమా (Diploma) https://www.mhrdnats.gov.in/boat/commonRedirect/registermenunew!registermenunew.యాక్షన్
ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్.. https://www.iocl.com/apprenticeships- సందర్శించాలి..