TS Governor: గవర్నర్ కు అయోధ్య అక్షింతలు అందజేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ తొలి పౌరురాలు తమిళ సై సౌందర రాజన్ కి అయోధ్య రాముల వారి అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అందజేశారు. జనవరి ఒకటవ తేదీ నుంచి 15వ తారీకు వరకు నిర్వహించే జన సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని జనవరి 1న ఇవాళ (సోమవారం) రాష్ట్ర గవర్నర్ చేత ప్రారంభించారు. అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణంతో వందల ఏళ్ల నాటి హిందువుల కల సహకారమవుతోందనీ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి హిందువుకు రాముల వారి అక్షింతలు అందజేసి, మందిర దర్శనానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే తొలిరోజు రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ కి సంప్రదాయబద్ధంగా బొట్టుపెట్టి , అక్షింతలు, కుంకుమ, పసుపు, గాజులు అందజేసి రామమందిరా దర్శనానికి ఆహ్వానం పలికినట్లు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. దర్శనానికి తప్పకుండా వస్తానని చెబుతూ.. ఆనందంతో అక్షింతలు స్వీకరించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జైశ్రీరామ్ నినాదాలతో రాజ్ భవన్ లో హోరెత్తించారు. రామ లక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్ కి అంటూ ప్రతిగా అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ కూడా నినాదించడం విశేషం.
Read Also: Manchu Manoj: మనోజ్ అన్నా.. మెగా అల్లుడునే దింపావా..?
Also Read
ఇక, రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువును అయోధ్య రామ జన్మభూమి దర్శనానికి ఆహ్వానిస్తున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చెప్పారు. జనవరి 15వ తేదీ వరకు కోట్లాదిమంది హిందువులను కలిసి అక్షింతలు అందజేసి అయోధ్యకు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు ప్రతి గ్రామము, బస్తీ, పల్లె, తండా, గిరిజన ప్రదేశాలకు కూడా రాముడి అక్షింతలు చేరాయని.. వాటిని పంపిణీ ఈ రోజుతో ప్రారంభమైందని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, విశ్వహిందూ పరిషత్ బాధ్యులు సురేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!