NTV Telugu Site icon

CV Anand: తస్మాత్ జాగ్రత్త.. టెలిగ్రామ్‌, వాట్సాప్‌ల ద్వారా పెట్టుబడి మోసాలు!

Cv Anand

Cv Anand

చైనా కేంద్రంగా పెట్టుబడులు పేరుతో భారీ మోసం జరుగుతుందని హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. చిక్కడపల్లికి చెందిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ముఠాను పట్టుకున్నామని ఆయన తెలిపారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా రేట్ అండ్ రివ్యూ పేరుతో పార్ట్ టైం జాబ్ ఆఫర్ వచ్చింది బాధితుడికి.. ట్రావెలింగ్ బూస్ట్ 99.కామ్ లో బాధితుడు రిజిస్టర్ చేసుకున్నాడు.. ఈ వెబ్సైట్ ద్వారా బాధితుడికి ఐదు టాస్కులు ఇచ్చారు. వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 866 రూపాయలు ప్రాఫిట్ వస్తుందని నమ్మిస్తున్నారు. అయితే, ఆన్లైన్ విండోలో చూపించిన అమౌంట్ ను బాధితుడు విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా లాక్ చేసి.. బాధితుడి దగ్గర నుంచి రూ.28 లక్షలను కొట్టేశారు.. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని సీపీ ఆనంద్ పేర్కొన్నాడు.

Read Also: Guntur Kaaram: సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్

ఈ రాధిక మార్కెటింగ్ అకౌంటు హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ మున్వర్ మైంటైన్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం అకౌంట్లను అహ్మదాబాద్ కు చెందిన ప్రకాశ్ ప్రజాపతి మెయింటెయిన్ చేసేవాడు.. ఈ మొత్తం ఫ్రాడ్ లో చైనాకు చెందిన లుల్యో, నాన్ యే, కెవిన్ జూన్ లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఒక్కో అకౌంట్ ఓపెన్ చేసినందుకు రెండు లక్షల రూపాయలను ఈ ముఠా ఇస్తుంది. ఇలా ఒక్క ప్రజాపతే 65 అకౌంట్లను ఓపెన్ చేయించి చైనీయులకు అప్పగించాడు.. వీటి ద్వారా సుమారు 125 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగాయి. ఇతర అకౌంట్ ల నుంచి మరో రూ.584 కోట్ల నగదు బదిలీ జరిగింది అని సీపీ ఆనంద్ తెలిపారు.

Read Also: Extramarital Affair: చెన్నైలో దారుణం..మహిళ ప్రాణం తీసిన అక్రమ సంబంధం..

ఈ కేసులో 17 మొబైల్ ఫోన్లు రెండు ల్యాప్ టాప్స్, 22 సిమ్ కార్డ్స్, నాలుగు డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది మహేష్ బ్యాంకుకు సంబంధించిన కేసు చేశాము.. రోజుకి 20 నుంచి 30కి పైగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో చైనాకు సంబంధించిన వాళ్ళు ప్రధాన నిందితులుగా ఉన్నారని హైదరాబాద్ కమిషనర్ ఆనంద్ అన్నారు. టెలిగ్రామ్, వాట్సాప్ లో ద్వారా పెట్టుబడి ఫ్రాడ్ లకు పాల్పడుతున్నారని గుర్తించామని సీపీ తెలిపారు. 15 వేల మంది మోసపోయారు.. ఒక్కొక్కరు 5 లక్షల వరకు మోసపోయారు అని హైదరాబాద్ సీపీ పేర్కొన్నారు.

Read Also: Governor Abdul Nazeer: విద్యను సమాజ హితం కోసం వినియోగించాలి..

సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులే టార్గెట్ గా ఈ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి.. ఎక్కువ లాభాలు వస్తాయంటూ అత్యాశకు పోయి లక్షల రూపాయలను బాధితులు పోగొట్టుకుంటున్నారు అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేసుకొని నగదు తీసుకుంటున్నారు. బాయ్ లో ఉన్న నలుగురు ఒక్కో డాలర్ పైన పది రూపాయలు లాభం తీసుకొని చైనీయులకు పంపిస్తున్నారని హైదరాబాద్ కమిషనర్ చెప్పారు. హిజ్బుల్లా టెర్రర్ మాడ్యులర్ వాళ్ళకు ఈ నగదు లావాదేవీలు జరుపుతున్న వారికి లింకులు ఉన్నాయి. ఈ మోసంలో జరిగే నగదు లావాదేవీలు డబ్బులు ఉగ్రవాదులకు వెళ్తున్నాయని సీవీ ఆనంద్ అన్నారు. సామాన్యుడు వెళ్ళి ఒక్క అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పెడతారు.. అలాంటిది హైదరాబాద్ కు చెందిన వీరు లక్నో‌వెళ్ళి అక్కడ 65 అకౌంట్లు ఓపెన్ చేశారు.. బ్యాంకులు ఎలా వీటిని ఓపెన్ చేస్తున్నాయో అర్థం కావడం లేదు.. ఉగ్ర లింకులకు సంబంధించి ఎన్ఐఏకు సమాచారం అందించామని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

Show comments