చైన్నై రైల్వే స్టేషన్ లో దారుణం వెలుగు చూసింది.. రైల్వే స్టేషన్ లో పండ్ల వ్యాపారం చేసే మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని నలుగురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా సమాచారం.. ఆమె హత్య జరగడానికి కారణాలు వివాహేతర సంబంధాలే అని సమాచారం.. ఈ దారుణ ఘటన జరిగి రెండు రోజులు అయ్యింది.. ఆమె చనిపోవడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన తో ఒక్కసారిగా అందరు ఉలిక్కి పడ్డారు..
ఈ ఘటన తీవ్ర కలకలాన్ని సృష్టించింది. రాజేశ్వరి, ఆమె భర్త భువనేశ్వర్ మీనంబాక్కం ఎంజీఆర్ నగర్లో నివసిస్తున్నారు. జీవనోపాధి కోసం రాజేశ్వరి రోజూ రైల్వే స్టేషన్లలో పండ్లు, సమోసాలు అమ్ముతుండేది. బుధవారం నాడు కూడా రోజులాగే వ్యాపారాన్ని ముగించుకొని సాయంత్రాని కి ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్లడం కోసం సైదాపేట రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తోంది… ఆ సమయంలో నలుగురు వ్యక్తులు రైలు నుంచి దిగారు.. రైలు కోసం వెయిట్ చేస్తున్న ఈమెపై విచక్షణా రహితంగా దాడి చేసి క్షణాల్లోనే అక్కడి నుంచి మరో రైలు ఎక్కి పారిపోయారు..
చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆమెను అక్కడే ఉన్న రైల్వే పోలీసులు ఆసుపత్రి కి తరలించారు..అక్కడ చికిత్స తీసుకుంటూనే పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున ఆమె చనిపోయింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు రాజేశ్వరి కి పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యం లోనే హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఈ సైదాపేట రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాలు లేవు. దీంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమె ఫోన్లోని నెంబర్స్ ఆధారంగా వారిని వెంటనే కనిపెడతామని పోలీసులు చెబుతున్నారు..