శుక్రవారం, శనివారం హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ రైస్ సమ్మిట్ జరుగుతోందని, 22 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సదస్సులు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కమిడిటీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ జరుగుతోంద ఆయన వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొట్టమొదటి సారిగా భారతదేశంలో మన హైదరాబాదులో ఈ సమ్మిట్ నిర్వహించటానికి నిర్ణయించుకున్నారని, ఇది తెలంగాణకు గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 150 ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొనబోతున్నారని, వివిధ దేశాల వరి ఎగుమతి దిగుమతి దారులతోపాటు వరి వంగడాల పరిశోధకులు ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
భారతదేశం నుంచి సీడ్ కంపెనీల ప్రతినిధులు,రైస్ మిల్లర్లు అభ్యుదయ రైతులు, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ పాల్గొనబోతున్నారని, ఈ సదస్సు వల్ల తెలంగాణలో వరి పండించే రైతులకు మేలు జరిగే విధంగా దిగుబడినిచ్చే వంగడాలపై పలు సూచనలు చేయనున్నారని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ రకం వరి ధాన్యనికి డిమాండ్ ఉందో రైతులకు అవగాహన కల్పించనున్నారని, విత్తనోత్పత్తిలో ఆధునిక పరిజ్ఞానంపై చర్చించనున్నారని మంత్రి తుమ్మల అన్నారు. ప్రపంచంలో 100 దేశాలకు భారత్ నుంచి రైస్ ఎగుమతి జరుగుతుందని, రేపు ఉదయం తాజ్ కృష్ణ హోటల్లో 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కార్యక్రమం జరగబోతోందన్నారు మంత్రి తుమ్మల అన్నారు. ఈ సదస్సులో నాతో పాటు సివిల్ సప్లై అండ్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పాల్గొనబోతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు.