Covid Alert: కరోనా కట్టడిపై కేంద్రం దృష్టి.. నేటి నుంచి విదేశీ ప్రయాణికులకు పరీక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid Alert: కరోనా కొత్త వేరియంట్ కలవరపెడుతున్న వేళ కేంద్రం దృష్టి సారించింది. కొవిడ్ నివారణ చర్యలను చేపట్టాలని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు గుమిగూడకుండా చూడాలని, మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపడానికి కేంద్రం నిర్ణయించింది. ప్రయాణికులందరికీ కాకుండా కొందరికి పరీక్షలు జరిపేలా పౌర విమానయాన శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
నేటి ఉదయం నుంచి అంతర్జాతీయ విమానాల్లో వచ్చిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి పరీక్షలు జరపనున్నారు. ఎంపిక చేసిన వారిన విమానాశ్రయాల్లోనే కొవిడ్ పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు. ఎవరికైనా పాజిటివ్ అని తేలితే తదుపరి చర్యలకు గాను ఆ సమాచారాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిస్తారు. చైనాతో పాటు ప్రపంచంలోని మరికొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ విమానాల్లో వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి శనివారం ఉదయం నుంచి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
Sania Mirza: దేశంలో తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా.. కానీ నాలుగేళ్ల తర్వాతే..
కరోనా వైరస్ పరీక్ష ప్రక్రియ కోసం ఆరు రిజిస్ట్రేషన్ కౌంటర్లు, మూడు నమూనా బూత్‌లను ఏర్పాటు చేసినట్లు ముంబై విమానాశ్రయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ రాకపోకల కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, ప్రవేశ సమయంలో ఉన్న ఆరోగ్య అధికారులు ప్రయాణీకులందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. స్క్రీనింగ్ సమయంలో రోగలక్షణాలు ఉన్నట్లు గుర్తించిన ప్రయాణీకులను వెంటనే వేరుచేయాలి, నియమించబడిన వైద్య సదుపాయానికి తీసుకెళ్లాలి. ఫ్లైట్‌ను డిబోర్డ్ చేసే సమయంలో భౌతిక దూరం పాటించాలి.
తాజావార్తలు
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..