NTV Telugu Site icon

Kadapa Crime: ప్రేమపేరుతో పెట్రోల్ పోసి నిప్పు.. చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి

Kadapa Crime

Kadapa Crime

Kadapa Crime: ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికపై పెట్రోల్‌పోసి నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేల్‌లో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బద్వేల్ పట్టణంలో ప్రేమ పేరుతో యువకుడి చేతిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. బద్వేల్ సమీపంలోని పీపీ కుంట వద్ద ఉన్న సెంచరీ ప్లై వుడ్ కంపెనీ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి విఘ్నేష్ అనే యువకుడు నిప్పటించాడు. ఈ ఘటనలో దాదాపు 80 శాతం కాలిపోయిన విద్యార్థినిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు తెల్లవారుజామున చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Attack on Inter Student: భార్య వద్దు నీవే కావాలంటూ వేధించాడు.. వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు

అసలేం జరిగిందంటే. బద్వేల్ పట్టణంలోని రామాంజనేయ నగర్ లో నివాసం ఉంటున్నారు దస్తగిరమ్మ కుటుంబం. అదే కాలనీ అదే వీటికి చెందిన విఘ్నేష్ అనే యువకుడు గత కొంతకాలంగా దస్తగిరమ్మను ప్రేమిస్తున్నాను అంటూ వేధించేవాడు. ఇదే విషయమై పలుసార్లు దస్తగిరమ్మ తల్లిదండ్రులు విఘ్నేష్‌ను మందలించారట. అటు తరువాత మరో అమ్మాయిని ప్రేమ పేరుతో లేపుకుపోయి వివాహం చేసుకున్నాడు. ఒకపక్క ఒక అమ్మాయిని ప్రేమిస్తూ మరో పక్క మరో అమ్మాయితో ప్రేమాయణం నడిపాడు. ఆరు నెలల క్రితం విమల అనే అమ్మాయిని ప్రేమ పేరుతో లేపుకుపోయి వివాహం చేసుకున్నాడు విఘ్నేష్.. అంతటితో ఆగకుండా బద్వేల్ పట్టణం లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న దస్తగిరమ్మ అనే బాలికను ప్రేమ పేరుతో వేధిస్తూ నీవు లేకుంటే నేను బ్రతకలేను అని బెదిరించేవాడు . శుక్రవారం,శనివారం నేను నీతో మాట్లాడాలి రా అంటూ బాలికను బెదిరించడం తో అతనితోపాటు అడవిలోకి వెళ్ళింది.అడవిలోకి తీసుకెళ్లి తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆ బాలికపై ఒత్తిడి తెచ్చాడు. నీకు వివాహం అయ్యింది ఆరు సంవత్సరాల తర్వాత ఆమెను వదిలేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆ బాలిక చెప్పడంతో ఆగ్రహ వేషానికి లోనైన విఘ్నేష్ ఆ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతూ మైనర్ బాలిక ప్రాణాలు విడిచింది.