Steal Wires: టీవీ సీరియల్ స్ఫూర్తితో.. ఐఫోన్ కోసం వైర్లను ఎత్తుకెళ్లారు.. చివరకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Steal Wires: ఐఫోన్ కొనుక్కోవాలని వైర్ల దొంగతనానికి ఒడిగట్టారు ముగ్గురు యువకులు. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలోని నస్రుల్లాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు మైనర్‌లతో సహా ముగ్గురు యువకుల బృందం ఒక టీవీ సీరియల్‌లో చోరీ సీన్ నుంచి ప్రేరణ పొంది ‘ఐఫోన్‌లు’ కొనుగోలు చేయడానికి, ఇండోర్ సందర్శించడానికి డబ్బుల కోసం దొంగతనం చేయడం ప్రారంభించినట్లు పోలీసు అధికారి గురువారం తెలిపారు. జనవరి 12 రాత్రి సెహోర్‌లోని కృషి ఉపాజ్ మండి ప్రాంతంలోని ఒక దుకాణంలో జరిగిన దొంగతనం ఘటనకు సంబంధించి ముగ్గురిని బుధవారం అరెస్టు చేశారు. నిందితులను అశుతోష్ విశ్వకర్మగా, మరో ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 3.52 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నస్రుల్లగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృషి ఉపాజ్ మండి సమీపంలో మోటార్ వైండింగ్ దుకాణం నడుపుతున్న లోకేంద్ర శర్మ జనవరి 13న దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేశాడు. అతను దుకాణానికి తాళం వేసినట్లు పోలీసులకు చెప్పాడు. రాత్రి సమయంలో షాపింగ్ చేసి, మరుసటి రోజు ఉదయం దుకాణానికి చేరుకునే సరికి తాళం పగులగొట్టి ఉంది. షాపులోపల తనిఖీ చేయగా రాగి తీగలు, మోటారు రోటర్ ప్లేట్ కనిపించడం లేదు. అతని ఫిర్యాదు మేరకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP) ఆకాష్ అమల్కర్ వెల్లడించారు. విచారణలో సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ముగ్గురు యువకులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
Read Also: scrap: 15 ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలు ఇక తుక్కే.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
ఆ తర్వాత పోలీసులు వారిని పట్టుకున్నారు. విచారణలో వారిని ప్రశ్నించగా.. వారు చెప్పిన సమాధానానికి పోలీసులు ఆశ్చర్యపోయారు. వారు ఐఫోన్‌లు కొనాలనుకుంటున్నారని, ఇండోర్‌ను సందర్శించాలనుకుంటున్నట్లు పోలీసులకు చెప్పారు. అంతేకాకుండా వారు ఒక టీవీ సీరియల్ నుంచి దొంగతనం చేయడానికి ప్రేరణ పొందారని పోలీసులు వెల్లడించారు. సీరియల్‌లో వచ్చిన ఓ సన్నివేశాన్ని చూసి దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారని వారు తెలిపారు. నిందితుడు అశుతోష్ తన ఇంటి నుంచి కారు తెచ్చి పెయింట్ షాపులో స్ప్రే పెయింట్ కొని, సీసీ కెమెరాకు స్ప్రే పెయింట్ వేసి షాపు తాళం పగులగొట్టి విలువైన వస్తువులతో పరారయ్యాడు. నిందితులు నేరాన్ని అంగీకరించగా తదుపరి దర్యాప్తు చేపట్టారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?