NTV Telugu Site icon

HYDRA: మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం ప‌రిశీలన‌.. హైడ్రా కీలక నిర్ణయం

Hydra

Hydra

హైదరాబాద్ మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఏవీ రంగనాథ్ ప‌రిశీలించారు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వుల‌ను ప‌ట్టించుకోకుండా.. సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌‌తో పాటు 5 అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించ‌డంపై స్థానికుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల మేర‌కు రంగనాథ్ పరిశీలించారు. అక్రమ క‌ట్టడమ‌ని హైకోర్టు నిర్ధారించాక కూడా కోర్టు ఉత్తర్వుల‌ను ప‌ట్టించుకోకుండా భ‌వ‌నాన్ని నిర్మిస్తున్నట్లు గుర్తించారు. హైకోర్టు ఆర్డర్ ఆధారంగా గతేడాది మార్చిలో బిల్డింగ్ కొంతభాగాన్ని జీహెచ్ఎంసీ కూల్చేసింది. ఇవేవీ ప‌ట్టించుకోకుండా కొనసాగుతున్న ఈ బిల్డింగ్‌ను కూల్చేయాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది.

Read Also: Atul Subhash Case: బెంగళూర్ టెక్కీ సుభాష్ సూసైడ్ కేసు.. భార్య నిఖితా సింఘానియాకు బెయిల్..

మరోవైపు.. సోమవారం నుండి హైడ్రాలోప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇకపై ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా హైడ్రా ప్రజావాణి కొనసాగనుంది. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణల పై నేరుగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రజావాణి నిర్వాహించనున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదుకు సంబంధిత ఆధారాలతో రావాలని హైడ్రా కమిషనర్ సూచించింది. మొదటగా వచ్చిన 50 మంది ఫిర్యాదుదారులకు టోకెన్స్ ఇచ్చి.. టోకెన్ ప్రకారం ఫిర్యాదులు స్వీకరిస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

Read Also: Namo Namah Shivaya: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న తండేల్ ‘నమో నమశ్శివాయ’